Mukesh Ambani Sundar Pichai: ముకేశ్ అంబానీ.. సుందర్ పిచాయ్.. ఒకరేమో అగ్రశ్రేణి పారిశ్రామికవేత్త, లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం రిలయన్స్‌కు అధినేత.. మరొకరు ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీల్లో ఒకటైన గూగుల్‌కు సీఈఓ.. వీరిద్దరిని కలిపింది క్రికెట్. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో మంగళవారం ఓ మ్యాచ్‌ను వారితో కలిసి టీమ్‌ఇండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి వీక్షించాడు. క్రికెట్ స్టేడియంలో ఉన్న ఫొటోను రవిశాస్త్రి తన ట్విట్టర్లో పోస్టు చేశాడు.
ది హండ్రెడ్ టోర్నమెంట్ రెండో ఎడిషన్‌లో భాగంగా లండన్ స్పిరిట్స్- మాంచెస్టర్ ఒరిజినల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ప్రస్తుతం రవిశాస్త్రి ఓ క్రీడా ఛానల్ తరఫున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ మ్యాచ్‌ను చూసేందుకు ముకేశ్ అంబానీ, సుందర్ పిచాయ్ విచ్చేశారు. ఈ సందర్భంగా వారితో దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. ''క్రికెట్‌ను అభిమానించే ఇద్దరు దిగ్గజాలతో కలిసినప్పుడు..'' అని క్యాప్షన్ ఇచ్చాడు.