Ind vs Eng: టీమ్ఇండియాలో కరోనా.. రవిశాస్త్రికి పాజిటివ్ - ind vs eng live updates
15:22 September 05
కోచ్ రవిశాస్త్రికి పాజిటివ్
టీమ్ఇండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి(ravi shastri corona positive) కరోనా బారిన పడ్డారు. ఆయనకు పాజిటివ్‌గా తేలడం వల్ల ముందు జాగ్రత్తగా మిగతా ముగ్గురు కోచింగ్ సిబ్బందిని ఐసోలేషన్‌లో ఉంచారు.
"హెడ్ కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్, ఫిజియో నితిన్ పటల్ను.. ఐసోలేషన్‌లో ఉంచాం. నిన్న సాయంత్రం చేసిన పరీక్షల్లో రవిశాస్త్రికి పాజిటివ్‌గా తేలింది. అయితే RT-PCR టెస్టు కూడా చేయాల్సి ఉంది. అంతవరకు టీమ్ఇండియాతో వీరు జట్టుతో కలవడానికి వీల్లేదు" అని బీసీసీఐ సెక్రటరీ జైషా ప్రకటనలో చెప్పారు.
టీమ్‌లోని ఆటగాళ్లకు కూడా శనివారం రాత్రి, ఆదివారం ఉదయం రెండుసార్లు కరోనా పరీక్షలు చేశారు. అందులో నెగటివ్ వచ్చినవారు.. ఇంగ్లాండ్‌తో నాలుగు టెస్టు నాలుగో రోజు ఆటలో పాల్గొంటారు. మూడోరోజు ఆటను 277/3తో ముగించింది టీమ్ఇండియా. ప్రస్తుతం 178 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకు ముందు తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌటౌంది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులు చేసింది.