తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఉమ్రాన్‌ మాలిక్‌కు టీ20 ప్రపంచకప్​లో ఛాన్స్​ ఇవ్వొద్దు'

Umran Malik Ravi Shastri: యువ పేసర్​ ఉమ్రాన్​ మాలిక్​కు అప్పుడే టీ20 ప్రపంచకప్​ జట్టులో అవకాశం ఇవ్వడం సరికాదు అంటున్నాడు టీమ్​ఇండియా మాజీ కోచ్​ రవిశాస్త్రి. అతను నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని.. వన్డేలు లేదా టెస్టులు ఆడే అవకాశం ఇవ్వాలని పేర్కొన్నాడు.

d
d

By

Published : Jun 11, 2022, 10:53 PM IST

Updated : Jun 12, 2022, 6:18 AM IST

Umran Malik Ravi Shastri: జమ్ముకశ్మీర్‌ యువ పేస్‌ బౌలింగ్‌ సంచలనం ఉమ్రాన్‌ మాలిక్‌ను ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌నకు టీమ్‌ఇండియాలో చేర్చుకోకూడదని భారత మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. అతడు ఇంకా నేర్చుకోవాలని, ప్రస్తుతం టీ20 జట్టులో అవకాశం ఇవ్వొద్దని రవిశాస్త్రి సూచించాడు. 'మాలిక్‌ను జట్టుతో తీసుకెళ్లండి. కానీ, అప్పుడే అవకాశాలు ఇవ్వడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అతడు నేర్చుకునేందుకు ఎంతో అవకాశం ఉంది. ఉమ్రాన్‌కు వన్డేలు లేదా టెస్టులు ఆడే అవకాశం ఇవ్వాలి. ఆ తర్వాత అతని ప్రదర్శన భవిష్యత్తును నిర్ణయిస్తుంది' అని రవిశాస్త్రి అన్నారు.

ఇటీవల ముగిసిన భారత టీ20 లీగ్‌లో హైదరాబాద్‌ తరఫున ఉమ్రాన్‌ మాలిక్ మంచి ప్రదర్శన కనబరిచాడు. 14 మ్యాచ్‌ల్లో 9.03 ఎకానమీతో 22 వికెట్లు పడగొట్టాడు. ఇతడు చాలా మ్యాచ్‌ల్లో 150 కి.మీ.ల వేగంతో బౌలింగ్‌ చేశాడు. దిల్లీతో జరిగిన ఓ మ్యాచ్‌లో ఏకంగా 157 కి.మీ. వేగంతో బౌలింగ్‌ చేసి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. దీంతో అందరూ భావించినట్టుగానే దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు అతడు ఎంపికయ్యాడు. తొలి టీ20లో ఉమ్రాన్‌ మాలిక్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. తర్వాతి మ్యాచ్‌ల్లో ఉమ్రాన్ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఇక, భారత్, సౌతాఫ్రికా మధ్య కటక్‌ వేదికగా ఆదివారం (జూన్‌ 12) రెండో టీ20 జరగనుంది. తొలి టీ20లో టీమ్‌ఇండియా 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే.

ఇదీ చూడండి :పంత్​ కెప్టెన్సీకి సవాల్​.. రెండో టీ20లో భారత్​ బోణి కొడుతుందా?

Last Updated : Jun 12, 2022, 6:18 AM IST

ABOUT THE AUTHOR

...view details