తెలంగాణ

telangana

ETV Bharat / sports

'నా వ్యాఖ్యలు అశ్విన్​ను బాధించి ఉంటే సంతోషమే' - క్రీడా వార్తలు తాజా

Ravi Shastri on Ashwin: కుల్​దీప్​ను ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలకు అశ్విన్​ బాధపడి ఉంటే అది తనకు సంతోషమే అన్నాడు టీమ్​ఇండియా మాజీ కోచ్​ రవిశాస్త్రి. అందువల్లే అశ్విన్​ ఆటతీరు మెరుగైందని పేర్కొన్నాడు.

ravi shastri on ashwin
రవిశాస్త్రి

By

Published : Dec 24, 2021, 9:39 AM IST

Ravi Shastri on Ashwin: విదేశాల్లో భారత్​ తరపున కుల్​దీప్​ యాదవే నంబర్​ వన్​ బౌలర్​ అంటూ అప్పటి హెడ్​కోచ్​ రవిశాస్త్రి ప్రశంసించడం తట్టుకోలేకపోయానని ఇటీవల సీనియర్​ స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్​ వాపోయాడు. తాజాగా ఈ విషయంపై రవిశాస్త్రి స్పందించాడు. నా వ్యాఖ్యలు అశ్విన్​ను బాధించి ఉంటే అందుకు సంతోషిస్తున్నానని వ్యాఖ్యానించాడు.

"అశ్విన్​ సిడ్నీ టెస్టు ఆడలేదు. ఆ స్థానంలో వచ్చిన కుల్​దీప్​ మంచి ప్రదర్శన చేశాడు. కుల్​దీప్​కు అవకాశం ఇవ్వడంలో తప్పులేదు. అది అశ్విన్​ను బాధించి ఉంటే అందుకు నేను సంతోషిస్తాను. ఆ తర్వాతే అతను వినూత్నంగా ఆడేందుకు ప్రయత్నిస్తున్నాడు. మీ కోచ్​ మీకు సవాల్​ విసిరితే మీరు ఏం చేస్తారు? ఇంట్లో ఏడుస్తూ కూర్చుంటారా? నేనైతే ఓ ఆటగాడిగా ఆ సవాల్​ను స్వీకరించి కోచ్​ అంచనాలు తప్పు అని నిరూపిస్తాను."

-రవిశాస్త్రి, టీమ్​ఇండియా మాజీ హెడ్​కోచ్​

2019 సిడ్నీ టెస్ట్​లో అశ్విన్​ స్థానంలో కుల్​దీప్​ను ఎంపిక చేసింది జట్టు యాజమాన్యం. ఆ టెస్టులో కుల్​దీప్​ ఐదు వికెట్లు పడగొట్టి మెరుగైన ప్రదర్శన చేశాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్​ తర్వాత రవిశాస్త్రి.. కుల్​దీప్​ యాదవే నంబర్​ వన్​ బౌలర్​ అంటూ వ్యాఖ్యలు చేశాడు.

అయితే ఆ మ్యాచ్​ తర్వాత కుల్​దీప్​ ఫామ్ కోల్పోవడం గమనార్హం. మరోవైపు అశ్విన్​ ప్రస్తుతం టెస్టు జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నాడు. రానున్న దక్షిణాఫ్రికా సిరీస్​లో భాగంగా అశ్విన్​పై భారీ అంచనాలే ఉన్నాయి.

ఇదీ చూడండి :Ind vs SA: సఫారీ గడ్డపై కూడా ఈ వేగం కొనసాగనీ..

ABOUT THE AUTHOR

...view details