తెలంగాణ

telangana

ETV Bharat / sports

'శాస్త్రికి కోచింగే తెలియదు.. అందుకే కోహ్లీ ఫామ్ కోల్పోయాడు'

టీమ్​ఇండియా మాజీ హెడ్​ కోచ్ రవిశాస్త్రి వల్లే స్టార్ బ్యాటర్​ విరాట్ కోహ్లీ ఫామ్​ కోల్పోయాడని అన్నాడు పాక్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్. వ్యాఖ్యాతగా ఉండే శాస్త్రికి కోచింగ్​లో ఎలాంటి అనుభవం లేదని పేర్కొన్నాడు. అదే ఇప్పుడు బెడిసికొడుతోందని చెప్పాడు.

Ravi Shastri
virat kohli form

By

Published : Jun 22, 2022, 9:15 PM IST

స్టార్ బ్యాటర్ విరాట్​ కోహ్లీ ఫామ్​లేమికి కారణం టీమ్​ఇండియా కోచ్​గా రవిశాస్త్రి బాధ్యతలు చేపట్టడమే అని అన్నాడు పాకిస్థాన్ మాజీ వికెట్ కీపర్ రషీద్ లతీఫ్. 2017 నుంచి 2021 వరకు హెడ్​ కోచ్​గా ఉన్న శాస్త్రికి.. భారత జట్టుకు శిక్షణ ఇవ్వగలిగే అనుభవం లేదని చెప్పాడు. శాస్త్రి కోచ్​ కాకపోయి ఉంటే కోహ్లీ ఫామ్​ కోల్పోయి ఉండేవాడు కాదని అభిప్రాయపడ్డాడు. రెండేళ్లుగా పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్న కోహ్లీ.. 2019 నవంబర్​ నుంచి ఏ ఫార్మాట్​లోనూ సెంచరీ నమోదు చేయలేదు.

"కుంబ్లే లాంటి ఆటగాడిని తప్పించారు. రవిశాస్త్రి కోచ్​గా వచ్చాడు. అతడికి ఆ అర్హత ఉందో లేదో నాకు తెలియదు. శాస్త్రిని నియమించడంలో కోహ్లీ కాకుండా ఇతర వ్యక్తుల పాత్ర కూడా ఉందనే భావిస్తున్నా. అతను ఒక వ్యాఖ్యాత. కోచింగ్​లో ఎలాంటి అనుభవం లేదు. అదే ఇప్పుడు బెడిసికొడుతోంది. అతడు కోచ్​ కాకపోయి ఉంటే.. కోహ్లీ ఫామ్​ కోల్పోయి ఉండేవాడు కాదు"

-రషీద్ లతీఫ్, పాక్ మాజీ క్రికెటర్

టీమ్ డైరెక్టర్​గా ఉన్న శాస్త్రిని.. సచిన్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ కోచ్​గా నియమించింది. ఐసీసీ ప్రపంచకప్ అనంతరం 2021 టీ20 ప్రపంచకప్​ వరకు.. 2019లో అతడు తిరిగి భారత ప్రధాన కోచ్​గా నియమితుడయ్యాడు. శాస్త్రి రిటైర్మెంట్​ అనంతరం రాహుల్​ ద్రవిడ్.. ఆ బాధ్యతలను చేపట్టాడు.

ఇదీ చూడండి:Virat Kohli Covid: విరాట్ కోహ్లీకి కరోనా.. అక్కడికి వెళ్లిన తర్వాతే..!

ABOUT THE AUTHOR

...view details