టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా పదవీ కాలం పూర్తయ్యాక శనివారం ఓ భావోద్వేగ పోస్ట్ పెట్టాడు రవిశాస్త్రి(ravi shastri news). భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ, టెస్టు వైస్ కెప్టెన్ అజింక్యా రహానేను ఇందులో ప్రస్తావించాడు. టీమ్ఇండియా కోచ్‌గా జ్ఞాపకాలు ఎప్పటికీ తనతోనే ఉంటాయని అన్నాడు.
"ఈ అత్యద్భుత ప్రయాణంలో నాకూ చోటు కల్పించినందుకు అందరికీ కృతజ్ఞతలు. హెడ్ కోచ్‌గా ఈ జ్ఞాపకాలు నాతోనే ఉంటాయి. సమయం వచ్చినప్పుడు జట్టుకోసం మళ్లీ వస్తా.. అప్పటివరకు ఆటను చూస్తా."
-రవిశాస్త్రి, టీమ్ఇండియా మాజీ కోచ్
హెడ్‌కోచ్‌గా రవిశాస్త్రి(ravi shastri coaching tenure) వైదొలగటంపై టీమ్ఇండియా ఆటగాళ్లంతా భావోద్వేగమైన పోస్టులు పెట్టారు.
టీ20 ప్రపంచకప్‌తో(T20 World Cup 2021) కోచ్ రవిశాస్త్రి, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్‌ల పదవీ కాలం ముగిసింది. టీమ్ఇండియా జట్టుకు హెడ్ కోచ్ కావడానికి ముందు రవిశాస్త్రి వ్యాఖ్యాతగా పనిచేశాడు. మరోసారి రవిశాస్త్రి వ్యాఖ్యాతగా రీఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
రవిశాస్త్రి(ravi shastri coaching tenure) అధ్వర్యంలో.. ఆస్ట్రేలియాను రెండు సార్లు ఓడించింది టీమ్ఇండియా. శాస్త్రి కోచ్‌గా ఉన్నప్పుడే భారతజట్టు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌పై టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. 2019లో ఐసీసీ వరల్డ్‌కప్ సెమీస్‌కు చేరుకుంది టీమ్ఇండియా. ఆతర్వాత ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ వరకూ వెళ్లింది.
ప్రధాన కోచ్‌గా ద్రవిడ్
టీ20 కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ(virat kohli news) శకం ముగిసినందువల్ల.. నవంబర్ 17 నుంచి న్యూజిలాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు రోహిత్ శర్మ(rohit sharma news)ను కొత్త కెప్టెన్‌గా ఎంపిక చేసింది బీసీసీఐ. ఈ సిరీస్ నుంచే భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్(rahul dravid coach) బాధ్యతలు చేపట్టనున్నాడు.
ఇదీ చూడండి:హెడ్‌కోచ్‌గా ఐదేళ్లు.. రవిశాస్త్రి సాధించిన ఘనతలివే