తెలంగాణ

telangana

ETV Bharat / sports

అఫ్గాన్​​ పరిస్థితిపై రషీద్​ ఖాన్​ తీవ్ర ఆందోళన - రషీద్​ ఖాన్​

అఫ్గానిస్థాన్​ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల వల్ల ఆ దేశ స్టార్​ క్రికెటర్​ రషీద్​ ఖాన్​ తీవ్ర ఒత్తిడికి గురయ్యాడని చెప్పాడు ఇంగ్లాండ్​ మాజీ క్రికెటర్​ కెవిన్​ పీటర్సన్. అక్కడ చిక్కుకుపోయిన తన కుటుంబాన్ని దేశం దాటించలేకపోతున్నందుకు ఆవేదన చెందుతున్నాడని అన్నాడు.

rashid
రషీద్​

By

Published : Aug 16, 2021, 10:27 PM IST

ఎవరూ ఊహించని రీతిలో అఫ్గానిస్థాన్​ను తాలిబన్లు హస్తగతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితి గందరగోళంగా మారింది. దీంతో ఆ దేశ స్టార్​ క్రికెటర్​ రషీద్​ ఖాన్​ ఆందోళన చెందుతున్నాడు. ఈ విషయాన్ని ఇంగ్లాండ్​ మాజీ క్రికెటర్​ కెవిన్​ పీటర్సన్​ తెలిపాడు. ఆ దేశంలో ఉన్న తన కుటుంబాన్ని అక్కడి నుంచి బయటకు రప్పించలేకపోతున్నందుకు రషీద్​ చాలా బాధపడుతున్నాడని చెప్పాడు. దీంతో అతడు తీవ్ర ఒత్తిడికి గురైనట్లు వెల్లడించాడు. అయితే ఇవన్నీ మర్చిపోయి రషీద్​ ముందుకు సాగగలడన్న విశ్వాసం తనకు ఉందని చెప్పాడు.

అఫ్గానిస్థాన్​లో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభం వల్ల కాబుల్​లోని హమీద్​ కర్జాయ్​ ఇంటర్నేషనల్​ విమానాశ్రయానికి రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో అక్కడి ప్రజలు దేశం దాటలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే రషీద్ పరిస్థితి​పై పీటర్సన్​ వ్యాఖ్యలు చేశాడు.

రషీద్​ ప్రస్తుతం.. ఇంగ్లాండ్​లో ది హండ్రెడ్​ లీగ్​లో ట్రెంట్​ రాకెట్స్​ తరఫున ఆడుతున్నాడు.

ఇదీ చూడండి:Rashid khan: 'అఫ్గాన్​ క్రికెటర్లు ఇద్దరూ​ ఐపీఎల్​లో ఆడతారు'

ABOUT THE AUTHOR

...view details