అఫ్గానిస్థాన్(Afghanistan)లో భద్రతా బలగాలు, తాలిబన్‌ల మధ్య భీకర పోరులో రక్తం ఏరులై పారుతోంది. ఇలాంటి క్లిష్ట సమయాల్లో తమ దేశం పట్ల అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని ఆ దేశ రాజకీయ నాయకులకు సూచించాడు క్రికెటర్ రషీద్ ఖాన్(Rashid Khan). ఈ పరిస్థితుల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని.. ప్రజలను గందరగోళంలో పడేయొద్దని రాజకీయ ప్రముఖులను కోరాడు.
"ప్రియమైన ప్రపంచ నాయకులారా! నా దేశం తీవ్రమైన గందరగోళంలో ఉంది. పిల్లలు, మహిళలు సహా రోజుకు వేలాది మంది అమాయక ప్రజలు బలవుతున్నారు. గృహ సముదాయాలూ ధ్వంసమవుతున్నాయి. వేలాది కుటుంబాలు వలస వెళుతున్నాయి. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో మా దేశాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. అప్ఘాన్ ప్రజలను చంపడం ఆపండి, మా దేశాన్ని ధ్వంసం చేయడం మానుకోండి. మాకు శాంతి కావాలి."