Rape attempt: బీహార్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాకేష్ తివారీ తనపై అత్యచార యత్నానికి పాల్పడ్డారంటూ ఓ ప్రైవేటు కంపెనీలో డైరెక్టర్‌గా విధిలు నిర్వహిస్తున్న మహిళ పోలీసులను ఆశ్రయించారు. తమకు రావలసిన డబ్బుల కోసం దిల్లీలోని ఓ 5 స్టార్ హోటల్‌కు వెళ్తే.. అక్కడ బలవంతంగా అత్యాచారానికి యత్నించారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు దిల్లీ డీసీపీ అమ్రిత గుగులౌత్ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం..
బాధితురాలు ఒక ప్రైవేటు ఈవెంట్ ఆర్గనైజింగ్ కంపెనీ డైరక్టర్‌గా బాధ్యతలు వహిస్తున్నారు. ఆ కంపెనీ స్పోర్ట్స్ మేనేజ్మెంట్, ఈవెంట్ ఆర్గనైజేషన్స్ వంటివి కార్యక్రమాలు చేస్తుంటారు. గతేడాది బీహర్ క్రికెట్ అసోసియేషన్ టీ20 లీగ్‌లను నిర్వహించింది. ఆ లీగ్‌కు సంబంధించిన ప్రకటనల కాంట్రాక్ట్‌ను బాధితురాల కంపెనీకి అప్పజెప్పారు.
లీగ్ పూర్తయినా డబ్బుల చెల్లింపులు జరగలేదు. అయితే గతేడాది జులైలో బాధితురాలు డబ్బులు కోసం రాకేష్ తివారీని కలవడానికి దిల్లీలోని ఓ 5 స్టార్ హోటల్‌కు వెళ్లింది. డబ్బుల కోసం వారిద్దరి మధ్య చర్చలు జరిగాయి. అక్కడ బలవంతంగా అత్యాచారం చేయబోయారని, తాను తప్పించుకుని పారిపోయానని బాధితురాలు తెలిపింది.
ఇదీ చదవండి:క్రికెట్లో కొత్త రూల్స్.. ఇకపై మన్కడింగ్ నిషేధం!