తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​ కొత్త జట్టుపై దీపిక- రణ్​వీర్ ఆసక్తి! - రణ్​వీర్ సింగ్ దీపిక

ఐపీఎల్​ కొత్త జట్టుపై(IPL New teams) బాలీవుడ్​ హాట్​ కపుల్​ రణ్​వీర్ సింగ్- దీపికా పదుకొణె(Deepika Padukone News) ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. ఓ ఫ్రాంచైజీని సొంతం చేసుకునేందుకు వారు బిడ్ దాఖలు చేసినట్లు సమాచారం.

IPL trophy
ఐపీఎల్ ట్రోఫీ

By

Published : Oct 22, 2021, 5:18 PM IST

వచ్చే ఏడాది ఐపీఎల్​ సీజన్(IPL 2022 New Teams)​ అభిమానుల్లో సరికొత్త జోష్​ నింపనుంది. 2022 లీగ్​లో పది టీమ్​లు పాల్గొంటాయని బీసీసీఐ ప్రకటించింది. ఈ మేరకు రెండు కొత్త టీమ్​ల కోసం ఇటీవలే టెండర్లు కూడా ఆహ్వానించింది. ఈ ఫ్రాంచైజీలను సొంతం చేసుకునేందుకు స్వదేశీ సంస్థలతో పాటు విదేశీ సంస్థలు కూడా ఆసక్తి చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. బాలీవుడ్​ స్టార్​ కపుల్ రణ్​వీర్ సింగ్-దీపికా పదుకొణె జంట(Ranveer Singh News) ఓ ఫ్రాంచైజీని కొనేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. కాగా, ఓ ఫ్రాంచైజీ ఫుట్​బాల్​ క్లబ్ 'మాంచెస్టర్​ యునైటెడ్'​ కూడా బీసీసీఐ నుంచి టెండర్​ పత్రాలు కొనుగోలు చేసినట్లు సమాచారం.

కొత్తేం కాదు..

ఐపీఎల్​ జట్ల కొనుగోలుపై నటీనటులు ఆసక్తి చూపడం కొత్తేం కాదు. ఇప్పటికే ప్రీతి జింతా, షారుక్​ ఖాన్.. పంజాబ్​, కోల్​కతా జట్లకు సహయజమానులుగా ఉన్నారు.

క్రీడలతో అనుబంధం..

దీపిక, రణ్​వీర్ జంటకు(Deepika Padukone News) క్రీడలతో మంచి అనుబంధమే ఉంది. దీపిక తండ్రి ప్రకాశ్ పదుకొనే.. ఒకప్పటి ఆల్​ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్. కాగా, రణ్​వీర్.. ప్రముఖ బాస్కెట్​బాల్ లీగ్ ఎన్​బీఏకు అంబాసిడర్​గా ఉన్నాడు. ఇంగ్లీష్ ప్రీమియర్​ లీగ్​తోనూ రణ్​బీర్​కు సంబంధాలున్నాయి.

ఇదీ చదవండి:

ipl 2021: ఐపీఎల్ కొత్త జట్లు ఆ నగరాల నుంచే..!

ABOUT THE AUTHOR

...view details