Ranji trophy 2022 schedule: రంజీ ట్రోఫీ.. ఐపీఎల్‌కు ముందు, తర్వాత రెండు షెడ్యూల్స్‌లో జరగనుంది. ఈ విషయాన్ని ఖరారు చేస్తూ, గురువారం సంబంధిత తేదీలను వెల్లడించారు. ఆయా రాష్ట్రాల క్రికెట్ బోర్డులకు బీసీసీఐ సెక్రటరీ జైషా లేఖలు పంపించారు. తొమ్మిది వేదికల్లో మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఇందులో భాగంగా రంజీ తొలిదశ మ్యాచ్‌లు ఫిబ్రవరి 10-మార్చి 15 వరు, రెండో దశ మే 30 నుంచి జూన్ 26 వరకు జరగనున్నట్లు జైషా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ జట్టు గ్రూప్-ఈలో, హైదరాబాద్ జట్టు ఎలైట్ గ్రూప్-బీలో ఉన్నాయి.
టోర్నీలో ఈసారి ఒక్కో గ్రూపులో ఆరు జట్లు ఉండగా.. ఆ సంఖ్యను నాలుగుకు కుదించి ఎనిమిది గ్రూపులకు పెంచారు. ఈ ట్రోఫీని అహ్మదాబాద్, కోల్‌కతా, త్రివేండ్రం, కటక్, చెన్నై, గువాహటి, హైదరాబాద్, బరోడా, రాజ్‌కోట్ వేదికల్లో నిర్వహించనున్నారు. దీన్ని బట్టి తొమ్మిది వేర్వేరు బయో బబుల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు.