తెలంగాణ

telangana

ETV Bharat / sports

Duleep Trophy 2023 : రంజీల్లో సూపర్​ స్టార్​.. దులీప్‌ ట్రోఫీలో నో ఛాన్స్‌.. బౌలర్​ ట్వీట్​ వైరల్! - madhya pradesh spinner jalaj saxena twitter

Duleep Trophy 2023 : రంజీ ట్రోఫీలో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చినప్పటికీ దులీప్ ట్రోఫీలో తనకు అవకాశం రాకపోవడంపై ఓ యువ క్రికెటర్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ట్విట్టర్​ వేదికగా కమిటీ మెంబర్స్​ను పరోక్షంగా ప్రశ్నించాడు. ఇంతకీ అతడు ఎవరంటే?

madyapradesh spinner jalaj saxena
jalaj saxena

By

Published : Jun 18, 2023, 1:30 PM IST

Updated : Jun 18, 2023, 1:35 PM IST

Duleep Trophy 2023 : త్వరలో జరగనున్న దులీప్​ ట్రోఫీకి షెడ్యూల్​ వచ్చేసింది. జూన్ 28 నుంచి జులై 12వ తేదీ వరకు బెంగళూరు వేదికగా ఈ టోర్నీ ప్రారంభం కానుంది. తెలుగు ఆటగాడు హనుమ విహారిని సౌత్‌ జోన్‌ జట్టుకు సారథిగా నియమిస్తూ అసోసియేషన్‌ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 15 మంది సభ్యులతో కూడిన జట్టును సౌత్‌జోన్ అసోసియేషన్‌ ప్రకటించింది. ఇక తాజాగా ఈస్ట్ జోన్​ను కూడా ప్రకటించింది.

అయితే దులీప్ ట్రోఫీ కోసం జరిగిన జట్ల ఎంపికపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మరో బౌలర్ తనను ఎంపిక చేయకపోవడంపై ట్విటర్ వేదికగా స్పందించాడు. మధ్యప్రదేశ్‌ స్పిన్నర్ జలజ్ సక్సేనాకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌కు దులీప్‌ ట్రోఫీలో మాత్రం చోటు దక్కలేదని విమర్శించాడు.

"రంజీ ట్రోఫీలో (ఎలైట్ గ్రూప్‌) అత్యధిక వికెట్‌ టేకర్‌. అయితే, దులీప్ ట్రోఫీలో మాత్రం చోటు దక్కలేదు. ఇలాంటి ఘటన భారత దేశవాళీ చరిత్రలో ఎప్పుడైనా జరిగిందో ఓ సారి చెక్‌ చేసి చెప్పగలరా? జస్ట్‌ తెలుసుకోవాలని అడిగాను. ఇది ఎవరినీ ఉద్దేశించి కాదు" అని జలజ్‌ పేర్కొన్నాడు.

రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో కేరళ తరఫున ఆడిన జలజ్.. ఏడు మ్యాచ్‌ల్లో 50 వికెట్లు తీశాడు. అతడి ఎకానమీ 2.75 కావడం విశేషం. ఒకే ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన 8/36 ఇచ్చిన ఘనతను కూడా నమోదు చేశాడు. అయినప్పటికీ దులీప్ ట్రోఫీ కోసం అతడిని ఎంపిక చేయకపోవడం గమనార్హమని క్రికెట్​ అభిమానులు ఆవేదన చెందుతున్నారు.

జలజ్ సక్సేనా కేవలం స్పిన్నర్‌గానే కాకుండా బ్యాటర్‌గానూ ఆల్‌రౌండ్ ప్రదర్శన చేస్తాడు. ఇప్పటి వరకు తన ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో 133 మ్యాచ్‌లు ఆడాడు. మొత్తం 14 శతకాలు, 32 అర్ధ శతకాలతో 6,567 పరుగులను సాధించాడు. అలాగే ఆఫ్‌ స్పిన్నర్‌ అయిన జలజ్‌ 410 వికెట్లు తీశాడు. 28 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శనను చేశాడు.

Duleep Trophy South Zone Team :
సౌత్‌ జోన్ జట్టు: హనుమ విహారి (కెప్టెన్), మయాంక్‌ అగర్వాల్ (వైస్‌ కెప్టెన్), రికీ భుయ్‌ (వికెట్ కీపర్), కేఎస్ భరత్‌ (వికెట్ కీపర్),సాయి సుదర్శన్‌, సమర్థ్, తిలక్ వర్మ, సాయి కిశోర్, కావేరప్ప, వైశాక్ విజయ్ కుమార్, ప్రదోష్ రంజన్‌ పాల్, కేవీ శశికాంత్‌, దర్శన్‌ మిసాల్, వాషింగ్టన్ సుందర్,సచిన్ బాబీ.

Duleep Trophy East Zone Team :
ఈస్ట్‌జోన్ జట్టు: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), సంతాను మిశ్రా,ఇషాన్‌ పోరెల్, సుదిప్ ఘరామి, రియన్‌ పరాగ్,షహ్‌బాజ్‌ నదీమ్ (వికెట్ కీపర్), ఏ. మజుందార్‌, బిపిన్‌ సౌరభ్‌, కే కుషగ్రా (వికెట్ కీపర్), షహ్‌బాజ్ అహ్మద్, ముకేశ్‌ కుమార్,అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), ఆకాశ్ దీప్, అనుకుల్ రాయ్, మురా సింగ్.

Last Updated : Jun 18, 2023, 1:35 PM IST

ABOUT THE AUTHOR

...view details