దేశవాళీ క్రికెట్ టోర్నీల్లో ప్రధానమైన రంజీ టోర్నీకి (Ranji trophy 2021) సంబంధించి బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. 2021-22 సీజన్లో భాగంగా వివిధ రాష్ట్రాల జట్లను ఎలైట్ గ్రూప్, ప్లేట్ గ్రూప్‌లలో చేర్చిన వివరాలు వెల్లడించింది. వచ్చే ఏడాది జనవరి 5 నుంచి ఈ టోర్నమెంట్ ప్రారంభం కానుంది.
ఒక్కో గ్రూప్‌లో ఆరు టీమ్‌లు..
- ఎలైట్ గ్రూప్ 'ఎ'- పంజాబ్, గుజరాత్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, సర్వీసెస్, అసోం
- ఎలైట్ గ్రూప్ 'బి'- బంగాల్, విదర్భ, హరియాణ, కేరళ, త్రిపుర, రాజస్థాన్
- ఎలైట్ గ్రూప్ 'సి'-ముంబయి, దిల్లీ, కర్ణాటక, హైదరాబాద్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్
- ఎలైట్ గ్రూప్ 'డి'- సౌరాష్ట్ర, తమిళనాడు, జమ్ము కశ్మీర్, రైల్వేస్, గోవా, ఝార్ఖండ్
- ఎలైట్ గ్రూప్ 'ఈ'-ఆంధ్రా, ఉత్తర్‌ప్రదేశ్, బరోడా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, పుదిచ్చేరి
ఎనిమిది జట్లు..
- ప్లేట్ గ్రూప్- చండీగఢ్, మేఘాలయ, బిహార్, నాగాలాండ్, మణిపుర్, మిజోరం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్