Ranji Trophy 2024:భారత క్రికెటర్లు జాతీయ జట్టులోకి ఎంట్రీ లేదా రీ ఎంట్రీ ఇవ్వాలంటే డొమెస్టిగ్లో ప్రదర్శనల్నే పరిగణలోకి తీసుకుంటారు. ఆయా టోర్నీల్లో వారి పెర్ఫార్మెన్స్లు బట్టి టీమ్ఇండియాలోకి ఎంపిక చేస్తారు సెలక్టర్లు. ఐపీఎల్, రంజీ ట్రోఫీ, విజయ్ హరారే లాంటి టోర్నీలు ఆ లిస్ట్‌లో ఉంటాయి. టీమ్ఇండియాలోకి ఎంట్రీ ఇవ్వాలనుకున్న ప్రతి ప్లేయర్ అందులో సత్తా చాటి సెలక్టర్లు దృష్టిని ఆకర్షిస్తారు. అలా ప్రస్తుతం జరగుతున్న 2024 రంజీ ట్రోఫీలో భారత్ ప్లేయర్లు అదరగొడుతున్నారు. అందులో కొందరూ ఇప్పిటికే టీమ్ఇండియాలో ఉండాగా, మరికొందరు జాతీయ జట్టులోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి ఈ టోర్నీలో అత్యుత్తమంగా రాణిస్తున్న వారు ఎవరంటే?
ఛెతేశ్వర్ పుజారా:టీమ్ఇండియా నయావాల్ ఛెతేశ్వర్ పుజారా ఇటీవల టెస్టు జట్టులో చోటు కోల్పోయాడు. అయితే మళ్లీ టీమ్ఇండియాలో రీ ఎంట్రీయే లక్ష్యంగా పుజారా తాజా రంజీ ట్రోఫీలో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. సౌరాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా, ఝార్ఖండ్‌పై 243 భారీ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.
దేవదత్ పడిక్కల్:టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ కర్ణాటక తరఫున ఆడుతున్నాడు. అతడు పంజాప్పై మ్యాచ్‌లో 193 పరుగులు బాదాడు. తృటిలో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు.
తిలక్ వర్మ: హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న తిలక్ వర్మ, నాగాలాండ్‌పై సెంచరీతో చెలరేగాడు. 112 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో తిలక్ 100 పరుగులు చేలి నాటౌట్‌గా నిలిచాడు. ఫలితంగా హైదరాబాద్ 194 పరుగుల తేడాతో నెగ్గింది. కాగా, జనవరి 11 నుంచి అఫ్గానిస్థాన్‌తో జరిగే టీ20 సిరీస్‌కు తిలక్ ఎంపికయ్యాడు.