Ranji Trophy 2022: రంజీ ట్రోఫీ చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది దేశవాళీ మేటి జట్టు ముంబయి. గురువారం ఉత్తరాఖండ్‌తో జరిగిన క్వార్టర్ఫైనల్లో 725 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో సెమీ ఫైనల్లో అడుగుపెట్టిన ఆ జట్టు.. ప్రపంచ రికార్డును సైతం బ్రేక్ చేసింది. 92 ఏళ్ల క్రితం షెఫీల్డ్ షీల్డ్ క్రికెట్లో క్వీన్స్‌లాండ్‌పై 685 పరుగుల తేడాతో న్యూసౌత్ వేల్స్ గెలుపొందింది. ఇప్పటివరకు ఉన్న ఆ రికార్డును ముంబయి బ్రేక్ చేసింది.
రంజీల్లో అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన రికార్డు ఇంతకుముందు బంగాల్ పేరిట ఉండేది. 1953-54లో ఆ జట్టు ఒడిశాను 540 పరుగుల తేడాతో ఓడించింది. ఇక జార్ఖండ్‌తో మరో క్వార్టర్స్‌లో 129 ఏళ్ల రికార్డును బ్రేక్ చేస్తూ 9 మంది బంగాల్ బ్యాటర్లు 50+ సోర్లుసాధించిన తర్వాతి రోజే ముంబయి ఈ ఘనత సాధించింది. ఈ ప్రతిష్ఠాత్మక దేశవాళీ టోర్నీ సెమీస్‌లో ఉత్తర్‌ప్రదేశ్‌ను ఢీకొనబోతోంది ముంబయి.