తెలంగాణ

telangana

ETV Bharat / sports

Ranji Trophy 2022: ఫిబ్రవరి 16 నుంచే రంజీ ట్రోఫీ లీగ్​ మ్యాచ్​లు

Ranjji Trophy 2022: రంజీ ట్రోఫీ తొలిదశను ఫిబ్రవరి 16 నుంచి మార్చి 5 వరకు నిర్వహించనున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఈ టోర్నీని హైదరాబాద్​ సహా తొమ్మిది వేదికల్లో నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.

Ranji Trophy 2022
Ranji Trophy 2022

By

Published : Jan 31, 2022, 10:30 PM IST

Ranjji Trophy 2022: రంజీ ట్రోఫీ లీగ్​ దశను ఫిబ్రవరి 16 నుంచి మార్చి 5 వరకు నిర్వహించనున్నట్లు బీసీసీఐ తెలిపింది. జనవరి 13 నుంచి ప్రారంభం కావాల్సిన ఈ ట్రోఫీ.. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వాయిదా పడింది. ఇప్పుడు దేశంలో పరిస్థితులు మెరుగుపడుతున్న నేపథ్యంలో దేశీవాళీ క్రికెట్ మ్యాచ్​లు నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది.

టోర్నీలో ఈసారి ఒక్కో గ్రూపులో ఆరు జట్లు ఉండగా.. ఆ సంఖ్యను నాలుగుకు కుదించి ఎనిమిది గ్రూపులకు పెంచారు. ఈ ట్రోఫీని.. అహ్మదాబాద్​, కోల్‌కతా, త్రివేండ్రం, కటక్​, చెన్నై, గువాహటి, హైదరాబాద్​, బరోడా, రాజ్‌కోట్ వేదికల్లో నిర్వహించనున్నట్లు బిసీసీఐ వర్గాలు తెలిపాయి. దీన్ని బట్టి తొమ్మిది వేర్వేరు బయో బబుల్స్​ను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.

రంజీ ట్రోఫీని రెండు దశల్లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు బీసీసీఐ సెక్రటరీ జైషా ఇప్పటికే చెప్పారు. దీని ప్రకారం.. రెండో దశను జూన్​లో జరపనున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:భారత గోల్​కీపర్​ శ్రీజేష్​కు ప్రతిష్ఠాత్మక అవార్డు

ABOUT THE AUTHOR

...view details