Ranji Trophy 2022: రంజీ ట్రోఫీ ఈ సీజన్ తొలిరోజు ఆట పూర్తయింది. ఆటగాళ్లు తమదైన శైలిలో అదరగొట్టారు. తొలిరోజే బ్యాట్స్‌మెన్ సెంచరీల మోత మోగించారు. ఈ జాబితాలో అండర్-19 ప్రపంచకప్ కెప్టెన్ యష్ ధూల్, యువక్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్‌తో పాటు గత కొంతకాలంగా పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న సీనియర్ ఆటగాళ్లు మనీశ్ పాండే, టెస్టు స్పెషలిస్ట్ రహానెలు కూడా ఉన్నారు.
రంజీ ట్రోఫీలో ఫుల్ జోష్.. తొలిరోజు సెంచరీల మోత - రంజీ మ్యాచ్ అప్డేట్స్
Ranji Trophy 2022: రంజీ ట్రోఫీకి అద్భుతమైన ప్రారంభం లభించింది. తొలిరోజే సెంచరీల మోత మోగింది. సీనియర్లతో పాటు యువ బ్యాటర్లు చెలరేగారు. దీంతో శతకాలు నమోదయ్యాయి.
రంజీ ట్రోఫీ
తొలి రోజు ఆటముగిసే సమయానికి..
- మణిపుర్‌తో మ్యాచ్‌లో అరుణాచల్ ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 119 పరుగులకు ఆలౌట్ కాగా మణిపూర్ 33 ఓవర్లకు ఒక వికెట్ కోల్పోయి 95 పరుగులు చేసింది.
- బంగాల్‌తో మ్యాచ్‌లో బరోడా 181 పరుగులకే ఆలౌట్ అయింది. మరోవైపు బంగాల్ 13 ఓవర్లలో 24 పరుగులు చేసి ఒక వికెట్ కోల్పోయింది.
- మిజోరంతో మ్యాచ్‌లో బిహార్ 90 ఓవర్లలో 325 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయింది. బబుల్ కుమార్ (123*), ఎస్ గనీ (136*) సెంచరీలు బాది బిహార్ జట్టు స్కోరును పరుగులు పెట్టించారు.
- చండీగఢ్ చీతాస్తో తలపడిన హైదరాబాద్ జట్టు 7 వికెట్లు కోల్పోయి 270 పరుగులు చేసింది.
- ఝార్ఖండ్‌ను 169 పరుగులకు కట్టడి చేసిన ఛత్తీస్‌గఢ్ జట్టు.. ఆ తర్వాత నాలుగు వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది.
- తమిళనాడుతో మ్యాచ్‌లో దిల్లీ ఏడు వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది.
- నాగాలాండ్‌తో మ్యాచ్‌లో సిక్కిం జట్టు తొమ్మిది వికెట్లు కోల్పోయి 291 పరుగులు చేసింది.
- రాజస్థాన్‌ను 275 పరుగులకు ఆలౌట్ చేసిన ఆంధ్రా జట్టు.. అనంతరం రెండు వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది.
- అసోంతో జరిగిన మ్యాచ్‌లో మహారాష్ట్ర జట్టు 5 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది.
- గోవా-ఒడిశా మ్యాచ్‌లో 181 పరుగులకే గోవా ఆలౌట్ కాగా.. ఒడిశా స్కోరు 23-3గా ఉంది.
- మధ్యప్రదేశ్ జట్టు గుజరాత్‌పై 7 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది.
- హరియాణాతో మ్యాచ్‌లో త్రిపుర జట్టు స్కోరు 327-4గా ఉంది.
- పంజాబ్‌పై హిమాచల్ ప్రదేశ్ 324 పరుగులు చేసింది. ఈ జట్టు ఆరు వికెట్లు కోల్పోయింది.
- జమ్మకశ్మీర్-పుదుచ్చేరి మ్యాచ్‌లో పుదుచ్చేరి టీమ్ ఆరు వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసింది.
- కర్ణాటకపై రైల్వేస్ స్కోరు 392-5గా ఉంది.
- మేఘాలయాతో మ్యాచ్‌లో కేరళ జట్టు, ప్రత్యర్థిని 148కు ఆలౌట్ చేసింది. అనంతరం ఒక వికెట్ నష్టానికి 205 పరుగులు చేసి 57 పరుగుల అధిక్యంలో ఉంది.
- సౌరాష్ట్రతో మ్యాచ్‌లో ముంబయి మూడు వికెట్లు కోల్పోయి 263 పరుగులు చేసింది.
- సర్వీసెస్‌ను 176కే ఆలౌట్ చేసిన ఉత్తరాఖండ్.. ఒక వికెట్ నష్టానికి 25 పరుగులు చేసింది.
- విదర్భాపై ఉత్తర్‌ప్రదేశ్ జట్టు ఏడు వికెట్లు కోల్పోయి 268 పరుగులు చేసింది.
ఇదీ చూడండి :రోడ్ సేఫ్టీ సిరీస్ రెండో సీజన్ త్వరలో ప్రారంభం