Ramiz Raza on IPL: ప్రతిష్ఠాత్మక ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను (ఐపీఎల్) సవాలు చేశాడు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ రమీజ్ రాజా! పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో (పీఎస్ఎల్) వచ్చే ఏడాది నుంచి వేలం ప్రక్రియను ప్రవేశపెడతామని.. అప్పుడు ఐపీఎల్లో ఎవరు ఆడతారో చూస్తామని చెప్పాడు. ఈ మేరకు ఇటీవలే ఓ క్రీడా ఛానెల్‌తో వ్యాఖ్యానించాడు.
"పీసీబీని ఆర్థికంగా బలోపేతం చేయడానికి సొంత ఆదాయ వనరుల్ని సృష్టించాలి. మా వద్ద ప్రస్తుతం పీఎస్ఎల్, ఐసీసీ నిధులు మాత్రమే ఉన్నాయి. వచ్చే ఏడాది నుంచి పీఎస్ఎల్లో వేలం విధానాన్ని ప్రవేశపెట్టాలని భావిస్తున్నాం. దీనిపై ప్రాంఛైజీలతో చర్చిస్తాం. పాకిస్థాన్ క్రికెట్‌కు ఆదాయం పెరిగితే.. మా గౌరవం కూడా పెరుగుతుంది. పీఎస్ఎల్లో వేలం ప్రక్రియ మొదలైతే ఆదాయం కూడా పెరుగుతుంది. అప్పుడు పీఎస్ఎల్ను దాటి వెళ్లి ఐపీఎల్లో ఎవరు ఆడతారో మేమూ చూస్తాం."