Ramiz Raja On India VS Pakistan: ఎప్పుడో 2012లో భారత్- పాకిస్థాన్ మధ్య చివరిసారిగా ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. అప్పటినుంచి ఇరు దేశాల మధ్య సిరీస్‌లు నిర్వహించాలని భావించినా.. భద్రతా పరిస్థితుల దృష్ట్యా అది కుదరడం లేదు.
ఈ క్రమంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఛైర్మన్ రమీజ్ రాజా ఆసక్తికర ట్వీట్ చేశాడు. భారత్- పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగకపోయినా, నాలుగు దేశాల మధ్య టీ20 సూపర్ సిరీస్ నిర్వహించాలని తాను అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)కి ప్రతిపాదిస్తానని అన్నాడు. ఈ సిరీస్‌లో భారత్, పాక్‌తోపాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు కూడా పాల్గొంటాయని తెలిపాడు. ఈ మేరకు రమీజ్ రాజా ట్వీట్ చేశాడు.
"హలో, ఫ్యాన్స్. నాలుగు దేశాల మధ్య టీ20 సూపర్ సిరీస్ నిర్వహించాలని ఐసీసీకి సిఫార్సు చేస్తాను. ఈ సిరీస్ ఏటా నిర్వహించాలి. ఒక్కో సంవత్సరం ఒక్కో దేశం ఆతిథ్యం ఇస్తుంది. తద్వారా ఈ సిరీస్‌పై వచ్చిన లాభాలను పర్సెంటేజ్ పద్ధతిలో ఐసీసీ సభ్యులందరికీ వాటా ఇస్తుంది" అని తన ట్వీట్లో పేర్కొన్నాడు రమీజ్ రాజా.
గతేడాది యూఏఈలో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో గ్రూప్ స్టేజీలో భారత్- పాకిస్థాన్ తలపడ్డాయి. బాబర్ అజామ్ సారథ్యంలో పాక్ జట్ట.. భారత్‌పై 10 వికెట్ల తేడాతో చారిత్రక విజయం నమోదు చేసింది. అయితే పాకిస్థాన్ జట్టు గ్రూప్ స్టేజ్‌లో అదరగొట్టినా.. సెమీఫైనలో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది.
ఇదీ చూడండి:IND Vs SA: 'కోహ్లీ బ్యాటింగ్ తీరుపై ఆందోళనే లేదు'