Ramiz Raja Commentary On Babar Azam : పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్‌పై.. పాక్ కికెట్ బోర్డు- పీసీబీ మాజీ ఛైర్మన్ రమీజ్ రజా వింత వ్యాఖ్యలు చేశాడు. బాబర్ అంటే తనకు చాలా ఇష్టమని.. తనను పెళ్లి చేసుకోవాలని ఉందని అన్నాడు. రమీజ్ చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది.
అసలు ఏం జరిగిందంటే?
బాబర్ అజామ్.. ప్రస్తుతం జరుగుతున్న లంక ప్రీమియర్ లీగ్‌లో కొలంబో స్ట్రయికర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. సోమవారం గాలో టైటాన్స్ టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో కొలంబో సారథి బాబర్ అద్భుత ప్రదర్శన చేసి.. సుడిగాలి శతకం బాదాడు. 59 బంతుల్లో 104 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు.
అయితే, ఈ మ్యాచ్‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ రమీజ్ రజా కామెంటరీ చేశాడు. ఈ క్రమంలో బాబర్ అజామ్ విధ్వంసకర ఇన్నింగ్స్‌ను కొనియాడాడు. "అద్భుతం.. క్లాస్, క్వాలిటీ, సెక్యూరిటీ కలిసి ఉన్న ఫిఫ్టీ. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఆధారపడగలిగిన ఆటగాడు అతడు. నేను అతడిని చాలా ప్రేమిస్తున్నాను.. అవును, అతడిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను" అని వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం రజా చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. నెటిజన్లు రమీజ్ రజాను ట్రోల్ చేస్తున్నారు.