తెలంగాణ

telangana

ETV Bharat / sports

తెలుగు కుర్రాళ్లకు గోల్డెన్ ఛాన్స్- చరణ్ క్రికెట్​ టీమ్​లోకి ఆహ్వానం- రిజిస్టర్ చేసుకోండిలా!

Ram Charam Team Hyderabad ISPL : గ్లోబల్​ స్టార్ రామ్​చరణ్ క్రీడా రంగంలో ఎంట్రీ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల యువతను క్రీడల్లో ప్రోత్సహించే విధంగా ఆయన ఐఎస్​పీఎల్​లో 'టీమ్ హైదరాబాద్​' జట్టును కొనుగోలు చేశారు.

Ram Charam Team Hyderabad ISPL
Ram Charam Team Hyderabad ISPL

By ETV Bharat Telugu Team

Published : Dec 24, 2023, 1:28 PM IST

Updated : Dec 24, 2023, 2:21 PM IST

Ram Charam Team Hyderabad ISPL :టాలీవుడ్ స్టార్ హీరో రామ్​చరణ్ ఇండియన్ స్ట్రీట్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ISPL- T10 ) లీగ్​లో 'టీమ్ హైదరాబాద్‌' జట్టును కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్​ ద్వారా తెలియజేశారు. 'ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్‌లో టీమ్ హైదరాబాద్ జట్టుకు జట్టుకు యజమానిగా వ్యవహరించడం హ్యాపీగా ఉంది. టాలెంట్, సమాజంలో స్ఫూర్తిని పెంపొందించడం, గల్లీ క్రికెట్‌ను సెలబ్రేట్‌ చేసుకోవడం కోసం ఇది ఓ ప్లాట్​ఫామ్' అని ట్విట్టర్​లో తెలిపారు. ఆసక్తి ఉన్న ఆటగాళ్లు జట్టులో జాయిన్ అవ్వడానికి ఓ లింక్​ను ఆయన షేర్ చేశారు. ఈ లింక్​ ద్వారా రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. కాగా, ఈ ఐఎల్​పీఎల్ తొలి ఎడిషన్ మార్చి 2 నుంచి 9 వరకు జరగనుంది.

రామ్​చరణ్ సినిమాతో పాటు వ్యాపార రంగంలోనూ యాక్టీవ్​గా ఉంటారు. ఇక తాజాగా ఐఎస్​పీఎల్​లో భాగస్వామ్యం కావడంపై ఆయన మాట్లాడారు.' క్రికెట్​లో కొత్తరకమైన ఎంటర్​టైన్​మెంట్​ను ఈ టోర్నీ అందించనుంది. లోకల్ ప్లేయర్లు తమ టాలెంట్​ను నేషనల్​వైడ్​గా​చూపేందుకు ఈ టోర్నీ ప్లాట్​ఫామ్​లా ఉపయోగడుతుంది. నేను హైదరాబాద్​ జట్టును సొంతం చేసుకోవడం హ్యాపీగా ఉంది' అని అన్నారు. అయితే ఈ టోర్నీతో తెలుగు రాష్ట్రాల్లో క్రికెట్​పై ఇంట్రెస్ట్​ ఉన్నవారికి రామ్​చరణ్ మంచి అవకాశం కల్పించినట్లైంది. ఇక ఈ లీగ్​లో రామ్​చరణ్​తోపాటు బాలీవుడ్ స్టార్లు అక్షయ్ కుమార్ (శ్రీ నగర్), అమితాబ్ బచ్చన్ (ముంబయి), హృతిక్ రోషన్ (బెంగళూరు) జట్లకు యజమానులుగా వ్యవహరిస్తున్నారు.

ఈ టోర్నమెంట్​ గురించి మరిన్ని విషయాలు

  • ఈ టోర్నీ టీ10 ఫార్మాట్​లో టెన్నిస్ బాల్​తో నిర్వహిస్తారు.
  • జట్టులో ఉండే 11 మందిలో ఒక్కరైనా అండర్-19 ఏజ్​ గ్రూప్​ ప్లేయర్ ఉండాలి. ఇక ఎలాంటి ఏజ్ లిమిట్ ఉండదు.
  • టోర్నీలో ఆడాలనుకునే ప్లేయర్లు ISPL వెబ్​సైట్​లో రిజిస్టర్ చేసుకోవాలి.
  • రిజిస్టర్ అయ్యాక ట్రయల్స్​లో పాల్గొనేందుకు గోల్డెన్ టికెట్ (ఎంట్రీ పాస్) పొందాల్సి ఉంటుంది.
  • ట్రయల్స్ జరిగే గ్రౌండ్, దానికి సంబంధించిన పలు వివరాలు త్వరలోనే వెబ్​సైట్​లో అప్​లోడ్ చేస్తారు.
  • ట్రయల్స్​లో ప్రదర్శన ఆధారంగా టోర్నీకి ప్లెయర్లను ఎంపిక చేస్తారు.

'ఫోర్బ్స్' మ్యాగజైన్​పై స్టైలిష్​గా చెర్రీ, ఉప్సీ- టాలీవుడ్​ ఫస్ట్ కపుల్​గా ఘనత!

రామ్​చరణ్​కు అరుదైన గౌరవం- పాప్ గోల్డెన్ అవార్డ్స్​లో విజేతగా స్టార్ హీరో

Last Updated : Dec 24, 2023, 2:21 PM IST

ABOUT THE AUTHOR

...view details