ప్రాక్టీస్ మ్యాచ్‌కు దెబ్బ.. టీ20 ప్రప్రంచకప్‌లో టీమ్‌ఇండియా ఆడటానికి ముందు న్యూజిలాండ్‌తో వార్మప్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే వర్షం కారణంగా రద్దైంది. ఆ తర్వాత పాకిస్థాన్‌తో మెల్‌బోర్న్ వేదికగా మ్యాచ్‌కు వరుణుడి గండం ఉందని వార్తలు వచ్చాయి. దీంతో సోషల్ మీడియాలో మీమ్స్ కూడా భారీ స్థాయిలో ట్రోల్ అయ్యాయి. అయితే వాతావరణం అనుకూలంగా మారడంతో దాయాదుల పోరును అక్టోబర్ 23న యథావిధిగా జరిగింది. ఈ ఉత్కంఠపోరులో టీమ్‌ఇండియా విజయం సాధించింది.
ఒకటి ఒకే.. మరొకటి మాత్రం.. హోబర్ట్ వేదికగా గ్రూప్ -2లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో విజయానికి చేరువగా వచ్చిన దక్షిణాఫ్రికాకు చేదు అనుభవం ఎదురైంది. ఫలితంగా ఒక్క పాయింట్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అంతకుముందే బంగ్లాదేశ్-నెదర్లాండ్స్ మ్యాచ్ ఇక్కడే జరిగింది. కానీ అనూహ్యంగా దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు చివర్లో వరుణుడు అడ్డంకిగా మారాడు. అయితే 9 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో జింబాబ్వేను 79/5 స్కోరుకే కట్టడి చేసిన దక్షిణాఫ్రికా.. ఛేదనను దూకుడుగా ప్రారంభించింది. తొలి ఓవర్‌లోనే డికాక్ దెబ్బకు జింబాబ్వే 23 పరుగులను సమర్పించింది. ఈ క్రమంలో వర్షం మరోసారి అంతరాయం కలిగించడంతో దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని 7 ఓవర్లకు 64 పరుగులుగా అంపైర్లు ఫిక్స్ చేశారు. దీంతో డికాక్ (47*: 18 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్) ధాటికి కేవలం మూడు ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా 51 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం రావడం.. మ్యాచ్ నిర్వహించే అవకాశం లేకపోవడంతో రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. అప్పటికీ సఫారీల జట్టు కేవలం 24 బంతుల్లో 13 పరుగులు చేయాల్సి ఉంది. వరుణుడి సహకారం లేకపోవడంతో మ్యాచ్ రద్దు అయిపోయింది.
అదే స్టేడియం.. అఫ్గాన్, ఇంగ్లాండ్‌కూ ...టీ20 ఫార్మాట్‌లో సంచలనాలు నమోదు చేసే జట్టు అఫ్గానిస్థాన్. నాణ్యమైన స్పిన్నర్లు, బ్యాటర్లు ఆ జట్టు సొంతం. అయితే సూపర్ -12 దశలో ఇంగ్లాండ్‌పై పోరాడి ఓడింది. స్వల్ప స్కోర్లు నమోదైన ఆ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను కట్టడి చేసేందుకు తీవ్రంగా కష్టపడింది. అయితే తర్వాత రెండు మ్యాచులూ వర్షార్పణం అయ్యాయి. అక్టోబర్ 26న న్యూజిలాండ్‌తో, అక్టోబర్ 28న ఐర్లాండ్‌తో మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు కావడం ఆ గ్రూప్‌లో సెమీస్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసే అవకాశం ఉంది. ఈ రెండు మ్యాచ్‌లకు వేదిక మెల్‌బోర్న్ కావడం గమనార్హం. భారత్-పాక్ మ్యాచ్ జరిగింది కూడా ఇదే స్టేడియంలోనే.
ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌కు కీలకమైన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. మెల్‌బోర్న్ వేదికగా టాస్ పడకుండానే మ్యాచ్ రద్దు కావడంపై ప్రేక్షకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఆసీస్‌కు తొలి మ్యాచ్‌లోనే కివీస్ షాక్ ఇచ్చింది. దాని నుంచి తేరుకొని లంకపై అద్భుత విజయం సాధించిన ఆసీస్.. ఇంగ్లాండ్‌పైనా గెలిచి సెమీస్ అవకాశాలను మెరుగుపర్చుకోవాలని భావించింది.
అలానే ఇంగ్లాండ్ కూడా అఫ్గానిస్థాన్‌ను చిత్తు చేసినప్పటికీ.. ఐర్లాండ్ చేతిలో భంగపాటు తప్పలేదు. వర్షం అంతరాయం కలిగించడంతో ఐర్లాండ్ ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో ఇంగ్లాండ్ ఒక్క పాయింట్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఐర్లాండ్‌కు భలే కలిసొచ్చిందిగా.. ప్రపంచకప్ సూపర్ - 12 దశలో తొలి సంచలనం ఐర్లాండ్ నమోదు చేసింది. పటిష్టమైన ఇంగ్లాండ్‌ను మట్టికరిపించింది. అయితే ఆ జట్టు ఆటగాళ్ల శ్రమతోపాటు వరుణుడు అండగా నిలవడంతోనే సాధ్యమైంది. మెల్‌బోర్న్ వేదికగా తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 157 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనలో 14.3 ఓవర్లలో 105/5 స్కోరుతో ఉన్న సమయంలో వర్షం అంతరాయం కలిగించింది. అప్పటికి క్రీజ్‌లో మొయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టోన్ హిట్టర్లు ఉన్నారు. ఇంకా 33 బంతుల్లో 53 పరుగులు చేయడం ఇంగ్లాండ్‌కు పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. అలాగే ఐర్లాండ్ కూడా ఇంకో రెండు వికెట్లు తీస్తే విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో వరుణుడి రాకతో.. ఫలితం డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ప్రకటించాల్సి వచ్చింది. అప్పటికి ఇంగ్లాండ్ ఐదు పరుగులు వెనుకబడి ఉంది. దీంతో 5 రన్స్ తేడాతో ఐర్లాండ్ విజయం సాధించినట్లు అంపైర్లు ప్రకటించారు. ఇలా ఐర్లాండ్‌కు వర్షం అలా కలిసొచ్చింది.