తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​-2022లో రాహుల్​కు రూ.17 కోట్లు.. ఇదే రికార్డు - రాహుల్ కోహ్లీ రికార్డు ఐపీఎల్

Rahul IPL record: ఐపీఎల్-2022లో కొత్త జట్టు లఖ్​నవూకు కెప్టెన్​గా వ్యవహరించనున్నాడు టీమ్ఇండియా క్రికెటర్ కేఎల్ రాహుల్. ఇతడిని రూ.17 కోట్లకు సొంతం చేసుకుంది ఫ్రాంచైజీ. లీగ్ చరిత్రలో ఇదే అత్యధిక ధర కావడం విశేషం.

KL Rahul IPL, కేఎల్ రాహుల్ ఐపీఎల్
KL Rahul

By

Published : Jan 22, 2022, 1:50 PM IST

Rahul IPL record: ఐపీఎల్‌లో కొత్త ఫ్రాంచైజీలు వేలానికి ముందు ప్రధాన ఆటగాళ్ల ఎంపికను పూర్తిచేశాయి. అహ్మదాబాద్‌కు హార్దిక్‌ పాండ్యా, లఖ్‌నవూకు కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ కోసం రూ.17 కోట్లు వెచ్చించింది లఖ్​నవూ ఫ్రాంచైజీ. లీగ్ చరిత్రలో ఇది ఓ రికార్డు.

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా విరాట్ కోహ్లీకి పేరుంది. 2018లో ఇతడిని రూ.17 కోట్లకు రిటైన్ చేసుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. తాజాగా వచ్చే సీజన్ కోసం రాహుల్​ను కూడా రూ.17 కోట్లకు సొంతం చేసుకుంది లఖ్​నవూ. దీంతో లీగ్​లో అత్యధిక ధర పలికిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ సరసన టాప్​-1లో నిలిచాడు రాహుల్.

లఖ్‌నవూ రాహుల్‌ కాక.. స్టోయినిస్‌ను రూ.9.2 కోట్లకు, రవి బిష్ణోయ్‌ను రూ.4 కోట్లకు దక్కించుకుంది. అహ్మదాబాద్‌.. హార్దిక్‌, రషీద్‌ ఖాన్‌ కోసం రూ.15 కోట్ల చొప్పున వెచ్చించింది. శుభ్‌మన్‌గిల్‌ను ఆ ఫ్రాంచైజీ రూ.7 కోట్లకు సొంతం చేసుకుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చూడండి: ఐపీఎల్ మెగావేలానికి 1214 మంది క్రికెటర్లు

ABOUT THE AUTHOR

...view details