భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ (Team India Coach) పదవికి రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid News) ఇదివరకే దరఖాస్తు చేశాడు. ప్రస్తుతం ఉన్న రవిశాస్త్రి (Ravi Shastri News) స్థానంలో రాహుల్ నియామకం లాంఛనమే. ఈ క్రమంలో టీమ్‌ఇండియాను విజయవంతంగా నడిపేందుకు బ్లూప్రింట్‌తో రాహుల్ ద్రవిడ్ వస్తాడని మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా అన్నాడు. రాహుల్ ద్రవిడ్ కోచ్ పదవి చేపడితే దీర్ఘకాలం జట్టు విజయం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తాడని వివరించాడు. ఈ మేరకు తన యూట్యూబ్ షోలో ఆకాశ్ చోప్రా (Aakash Chopra News) మాట్లాడుతూ.. "టీమ్‌ఇండియా కోసం రాహుల్ ఒక ప్రాసెస్‌ను ప్రవేశపెడతాడు. అతడు ఎంపికైతే.. ఐదేళ్లకు గానూ బ్లూ ప్రింట్‌ను సిద్ధం చేసుకుని వస్తాడు. స్వల్ప వ్యవధి కోసం కాకుండా ఐదేళ్ల నుంచి పదేళ్ల దీర్ఘకాలిక ప్రణాళికలతో రావొచ్చు" అని వివరించాడు.
Dravid: 'ద్రవిడ్ కోచ్ అయితే.. పక్కా బ్లూప్రింట్‌తో వచ్చేస్తాడు' - ఆకాశ్ చోప్రా
టీమ్‌ఇండియాకు (Team India Coach) కొత్త కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid News) నియామకం దాదాపుగా ఖరారైనట్లే. ఈ నేపథ్యంలో జట్టును విజయ పథంలో నడిపేందుకు ద్రవిడ్ బ్లూప్రింట్‌తో వస్తాడని అన్నాడు మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా.
జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) ఛైర్మన్‌గా, అండర్-19 జట్టు కోచ్‌గా ఇప్పటికే రాహుల్ ద్రవిడ్ ప్రశంసలు అందుకున్నాడు. విరాట్, రోహిత్‌తో ద్రవిడ్ కాంబినేషన్ చాలా ఆసక్తిగా ఉంటుందని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. "త్వరలోనే పొట్టి ఫార్మాట్‌లో రోహిత్-రాహుల్ ద్రవిడ్ (ఆర్-ఆర్), టెస్టు క్రికెట్‌లో కోహ్లీతో జట్టుకట్టడం చూడబోతున్నాం. ఇది చాలా ఉత్తేజభరితంగా ఉండబోతుంది. అధికారికంగా ద్రవిడ్ దరఖాస్తు చేసుకున్నాడు కాబట్టి.. ఇతర దరఖాస్తులను బీసీసీఐ పరిగణనలోకి తీసుకుంటుందని అనుకోవడం లేదు" అని ఆకాశ్ చోప్రా అన్నాడు.
ఇదీ చూడండి:Rahul Dravid: ద్రవిడ్ టీమ్‌ఇండియా కోచ్‌గా వద్దు!