తెలంగాణ

telangana

ETV Bharat / sports

'అప్పట్లో ద్రవిడ్​ను చూస్తే భయపడేవాళ్లం' - 'అప్పట్లో ద్రవిడ్​ను చూస్తే భయపడేవాళ్లం'

క్రికెట్​ దిగ్గజం రాహుల్ ద్రవిడ్​ తమతో ఎంత సన్నిహితంగా ఉన్నా.. ఆయన్ను చూస్తే కొంచెం భయంగా ఉండేదని వెల్లడించాడు టీమ్ఇండియా యువ ఓపెనర్​ పృథ్వీ షా. ఆటగాడి సహజ శైలిలో ఆడటానికి ద్రవిడ్ మద్దతిచ్చేవారని తెలిపాడు.

Rahul Dravid, Prithvi Shaw
రాహుల్ ద్రవిడ్, పృథ్వీ షా

By

Published : May 25, 2021, 3:57 PM IST

2018 అండర్-19 ప్రపంచకప్​ సందర్భంగా కోచ్​ ద్రవిడ్​తో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకున్నాడు టీమ్​ఇండియా యువ ఓపెనర్​ పృథ్వీ షా. ద్రవిడ్​తో కలిసి తాము డిన్నర్​ చేయాలంటే.. కొంచెం భయంగా ఉండేదని వెల్లడించాడు.

"ద్రవిడ్ సర్ మాతో చాలా సన్నిహితంగా ఉండేవారు. మైదానం వెలుపల కూడా మాతో ఫ్రెండ్లీగా ఉంటారు. మాతో కలిసి డిన్నర్​ కూడా చేస్తారు. అయినప్పటికీ ఆయనంటే కొంచెం భయంగా ఉంటుంది. ఆయన లాంటి దిగ్గజ క్రికెటర్​ పక్కన కూర్చోవాలనే ప్రతి యువ ఆటగాడి కల ఆయన వల్ల సాకారమైంది. ఆయనెప్పుడు తనలా ఆడాలని బలవంతంగా చెప్పరు. ఎవరి సహజ శైలిలో వారు ఆడాలని కోరుకుంటారు"

-పృథ్వీ షా, టీమ్​ఇండియా యువ ఓపెనర్.

ఇదీ చదవండి:రైల్వే శాఖ విధుల నుంచి సుశీల్ సస్పెండ్

"ఆటను ఆస్వాదించమని ద్రవిడ్​ సర్​ చెప్పేవారు. చేసిన తప్పులు పదే పదే చేస్తే తప్ప వారించేవారు కాదు. ఆయన ఎక్కువగా మానసిక అంశాలు, ఆటకు సంబంధించిన అంశాల గురించి మాత్రమే చర్చించేవారు" అని పృథ్వీ షా వెల్లడించాడు.

అండర్​-19తో పాటు ఇండియా-ఏ జట్లకు కోచ్​గా వ్యవహరిస్తున్న ద్రవిడ్​ను త్వరలో శ్రీలంకతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్​లకు కోచ్​గా ఎంపిక చేసింది బీసీసీఐ. అదే సమయంలో ఇంగ్లాండ్​లో డబ్ల్యూటీసీ ఫైనల్​తో పాటు రూట్​ సేనతో టెస్టు సిరీస్ ఉంది. సీనియర్ల జట్టుతో పాటే కోచ్ రవిశాస్త్రి వెళ్లనున్నాడు. దీంతో లంక టూర్ కోసం ద్రవిడ్​కు కోచ్​గా అవకాశం కల్పించారు.

ఇదీ చదవండి:సుశీల్​.. రాత్రంతా కన్నీరు- భోజనానికి నిరాకరణ

ABOUT THE AUTHOR

...view details