గాయాల బెడద లేకుంటేనే కీలక ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడతారని భారత కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. "పని భారం ఎక్కువ కాకుండా చూసుకోవడం ఆటలో భాగం. ఈ నేపథ్యంలోనే కోహ్లి, విరాట్, రాహుల్‌లకు వివిధ సిరీస్‌లకు విశ్రాంతినిచ్చాం. పని భారం, గాయాలను పర్యవేక్షించుకోవడం భిన్నమైన అంశాలు. కానీ రెండింటికి సమాన ప్రాధాన్యత ఇస్తున్నాం. కీలక ఆటగాళ్లకు గాయాల బెడద ఉంటే ఐపీఎల్‌లో ఆడరు. జాతీయ క్రికెట్ అకాడమీ, బీసీసీఐ వైద్య బృందంతో కలిసి స్టార్ ఆటగాళ్ల గాయాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో ఉన్న క్రికెటర్లు ఐపీఎల్‌లో ఆడడం వల్ల సత్తాను పరీక్షించుకునే అవకాశం వస్తుంది. ఆటగాళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటే ఐపీఎల్‌లో ఆడిస్తాం. ఎందుకంటే 2024 టీ20 ప్రపంచకప్‌కు కూడా ఈ టోర్నీ ఎంతో కీలకం" అని ద్రవిడ్ అన్నాడు.
అలా అయితేనే వారు ఐపీఎల్‌లో ఆడతారు: రాహుల్ ద్రవిడ్ - ఐపీఎల్‌పై రాహుల్ ద్రవిడ్ కామెంట్స్
2024 టీ20 ప్రపంచకప్ సహా ఐపీఎల్‌పై కీలక కామెంట్స్ చేశాడు టీమ్ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్. ఏం అన్నాడంటే..
భారత జట్టులో భిన్న సారథ్యంపై అడగాల్సింది తనను కాదని, సెలక్టర్లను అని ద్రవిడ్ చెప్పాడు. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌కు ముందు సన్నాహక శిబిరం ఉంటుందని అతను తెలిపాడు. "ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు ముందు సన్నాహక శిబిరం ఫిబ్రవరి 2న ఆరంభమవుతుంది. మరోవైపు అదే సమయంలో రంజీ క్వార్టర్‌ఫైనల్స్ ఉన్నాయి. కానీ కీలక ఆటగాళ్లను రంజీల్లో ఆడేందుకు అనుమతించం. అవసరమైతే సెమీస్, ఫైనల్స్‌కు పంపిస్తాం" అని ద్రవిడ్ చెప్పాడు. భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టుల సిరీస్ ఫిబ్రవరి 9న మొదలవుతుంది.
ఇదీ చూడండి:విరాట్ కోహ్లీ అరుదైన ఘనత.. క్రికెట్ చరిత్రలోనే ఒకే ఒక్కడిగా!