Rahul Dravid Team India Coach : వన్డే ప్రపంచకప్ 2023 పైనల్ మ్యాచ్ తర్వాత రాహుల్ ద్రవిడ్ పదవి కాలం కూడా ముగిసింది. దీంతో అతడితో పాటు పలువురు సహాయక సిబ్బంది కాంట్రాక్ట్‌లను పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. కానీ ఎంత కాలానికి అని మాత్రం వెల్లడించలేదు. ఇక ఇదే విషయంపై రాహుల్‌ను ప్రశ్నించగా.. తాను ఇప్పటి వరకు దానిపై సంతకం చేయలేదని.. బీసీసీఐ నుంచి అధికారికంగా పేపర్లు వచ్చే వరకు వెయిట్ చేయాలని అన్నాడు.
"ఇప్పటికీ అధికారికంగా ఇంకా ఏ విషయం బయటకు రాలేదు. నేను ఇంకా సంతకం చేయలేదు. నాకు ఆ పేపర్లు అందిన తర్వాత చర్చిస్తాం. ఆ తర్వాతే మీకేమైనా తెలుస్తుంది" అని ద్రవిడ్ మీడియాతో అన్నాడు. అయితే ఆయన త్వరలోనే బాధ్యతలను చేపట్టనున్నాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు దక్షిణాఫ్రికా పర్యటనతో హెడ్ కోచ్‌గా ద్రవిడ్ రెండోసారి బాధ్యతలను చేపట్టనున్నాడు. డిసెంబర్ 10 నుంచి ఈ పర్యటన ప్రారంభం కానుండగా.. ఇందులో భారత జట్టు దక్షిణాఫ్రికాతో మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచులు ఆడనుంది. దీని తర్వాత స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ కూడా ఆడనుంది. ఇక జూన్‌లో వెస్టిండీస్, యూఎస్ఏ ఆతిథ్యం ఇస్తున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ పోరుకు భారత జట్టు సిద్ధం కానుంది.