తెలంగాణ

telangana

ETV Bharat / sports

దుమ్మురేపిన రాహుల్ కొడుకు- కవర్ డ్రైవ్​లకు ఫ్యాన్స్​ ఫిదా- వీడియో చూశారా? - రాహుల్ ద్రవిడ్ చిన్న కుమారుడు

Rahul Dravid Son Samit Viral Video : భారత క్రికెట్ జట్టు హెడ్​ కోచ్​ రాహుల్ ద్రవిడ్ పెద్ద కుమారుడు సమిత్ ద్రవిడ్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. కూచ్ బిహార్ టోర్నీలో కవర్​ డ్రైవ్​లతో అదరగొడుతున్నాడు. ఆ వీడియో చూశారా మీరు?

Rahul Dravid Son Samit Viral Video
Rahul Dravid Son Samit Viral Video

By ETV Bharat Telugu Team

Published : Dec 21, 2023, 10:23 AM IST

Rahul Dravid Son Samit Viral Video :టీమ్​ఇండియా హెడ్​ కోచ్​ రాహుల్​ ద్రవిడ్ పెద్ద కుమారుడు సమిత్ ద్రవిడ్ కూచ్ బిహార్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్​లో అదరగొడుతున్నాడు. తన షాట్లతో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ టోర్నీలో కర్ణాటక తరఫున ఆడుతున్న సమిత్​, జమ్ముకశ్మీర్​లో జరిగిన మ్యాచ్​లో తన బ్యాటింగ్​తో అలరించాడు.

ఈ మ్యాచ్​ తొలి ఇన్నింగ్స్​లో 159 బంతులు ఆడాడు సమిత్ ద్రవిడ్. 13 ఫోర్లు, 1 సిక్సర్‌తో 98 పరుగులు సాధించాడు. అద్భుతమైన కవర్​ డ్రైవ్​లతో ఆకట్టుకున్నాడు. కొన్ని కవర్ డ్రైవ్​ షాట్​లు అతడి తండ్రినే తలపించాయి. ప్రస్తుతం సమిత్‌ బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు తండ్రికి తగ్గ తనయుడు అని కొనియాడుతున్నారు.

కాగా ఇదే మ్యాచ్‌లో సమిత్‌ ద్రవిడ్‌ బౌలింగ్‌లో కూడా రాణించాడు. మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి పతనాన్ని శాసించాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన సమిత్‌ 280 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్​లో జమ్ముపై 130 పరుగుల తేడాతో కర్ణాటక విజయం సాధించింది.

రాహుల్​ సింప్లిసిటీ
కొన్నిరోజుల క్రితం, ఈ టోర్నీలో భాగంగానే కర్ణాటక అండర్​-19 జట్టు ఉత్తరాఖండ్​తో తలపడింది. ఆ సమయంలో రాహుల్​ తన సతీమణి విజేతతో కలిసి కుమారుడి ఆటను చూసేందుకు మైసూర్ వడయార్ స్టేడియానికి వచ్చాడు. ఆ సమయంలో సింప్లిసిటీతో ఆకట్టుకున్నాడు రాహుల్.

మ్యాచ్​ జరుగుతున్న సమయంలో ప్రముఖుల కోసం ఏర్పాటు చేసిన గ్యాలరీలో కాకుండా సాధారణ వ్యక్తిలాగా తన భార్యతో కలిసి స్టేడియంలో మెట్లపై కూర్చొని కుమారుడి ఆటను చూశాడు. టీమ్ఇండియా హెడ్ కోచ్​ పొజిషన్​లో ఉండి కూడా మామూలు వ్యక్తిలా మెట్లపై కూర్చోని మ్యాచ్ చూడడం స్థానికంగా అందర్నీ ఆకర్షించింది.

'అందరు తల్లిదండ్రుల లాగే నేనూ నా కుమారుడి ఆట చూడడానికి వచ్చా. ఇందులో ఎలాంటి ప్రత్యేకత లేదు' అని రాహుల్ అన్నాడు. ఇక గ్రౌండ్​లో రాహుల్ కనిపించగానే ఫ్యాన్స్ సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఇక ద్రవిడ్ చిన్న కుమారుడు అన్వయ్ (14) కర్ణాటక అండర్-14 జట్టుకు కెప్టెన్​గా కొనసాగుతున్నాడు.

ట్విస్ట్ ఇచ్చిన రాహుల్​ ద్రవిడ్​ - 'నేను ఇంకా సంతకం చేయలేదు'

'ఆ విషయం ఇప్పుడు ఎందుకు - రోహిత్ గురించి మాకు క్లారిటీ లేదు'

ABOUT THE AUTHOR

...view details