తెలంగాణ

telangana

ETV Bharat / sports

గణాంకాలను మించి చూడాలి.. కోహ్లీ విషయంలో అదే చేశా: ద్రవిడ్ - విరాట్ కోహ్లీ గతంలో ఫామ్‌ కోల్పోయినప్పుడు

బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ ఆడుతున్న కోహ్లీ.. మొదటి మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో రాణించలేదు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ గతంలో ఫామ్‌ కోల్పోయినప్పుడు సమన్వయం ఎలా చేశాడో తాజాగా ప్రధాన కోచ్‌ రాహుల్ ద్రవిడ్‌ వెల్లడించాడు. ఏమన్నాడంటే?

rahul dravid
ద్రవిడ్

By

Published : Dec 15, 2022, 7:25 PM IST

Rahul Dravid Virat Kohli : గత ఆసియా కప్‌ ముందు వరకు విరాట్‌ కోహ్లీ ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. అర్ధశతకాలు సాధించినప్పటికీ.. సెంచరీ చేయలేదనే కారణంతో విమర్శలపాలయ్యాడు. దీంతో దాదాపు నెలరోజులపాటు ఆటకు విరామం ఇచ్చి వచ్చిన తర్వాత కీలక ఇన్నింగ్స్‌లతో చెలరేగిపోయాడు.

దాదాపు మూడేళ్ల తర్వాత ఏ ఫార్మాట్‌లోనైనా సరే సెంచరీ బాది భారమంతా ఒక్కసారిగా దించేశాడు. తాజాగా బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ ఆడుతోన్న కోహ్లీ.. మొదటి మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో రాణించలేదు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ గతంలో ఫామ్‌ కోల్పోయినప్పుడు సమన్వయం ఎలా చేశాడో తాజాగా ప్రధాన కోచ్‌ రాహుల్ ద్రవిడ్‌ వెల్లడించాడు.

వచ్చే ఏడాది భారత్‌ వేదికగా వన్డే ప్రపంచకప్‌ జరగనుంది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ ఫామ్‌లో ఉండటం టీమ్‌ఇండియాకి కలిసొచ్చే అంశమని ద్రవిడ్‌ పేర్కొన్నాడు. "కోహ్లీ తన ఉన్నత స్థాయి ఆటను మళ్లీ అందుకోవడం అంత తేలికైన విషయం కాదు. గత సంవత్సరం నుంచి విరాట్ సన్నద్ధతను ప్రత్యక్షంగా చూడటం అద్భుతంగా అనిపించింది. విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌ మరీ అధ్వాన్నంగా ఏమీ లేదు. కొన్ని అర్ధశతకాలు బాదాడు. కానీ సెంచరీ చేయలేదనే కారణంతోనే ఎన్నో అపవాదులను ఎదుర్కోవాల్సి వచ్చింది. కోచ్‌గా నేను ఎప్పుడూ గణాంకాలను పరిగణనలోకి తీసుకోను. అతడి ఆటతీరును మాత్రమే పరిశీలిస్తా. ఫామ్‌లో లేడని అంతా అనుకొనే సమయంలోనూ కోహ్లీ చాలా అద్భుతంగా బ్యాటింగ్‌ చేసిన సందర్భాలు ఉన్నాయి" అని తెలిపాడు.

ABOUT THE AUTHOR

...view details