మాజీ ఆటగాడు, ప్రస్తుత ఎన్‌సీఏ హెడ్ రాహుల్ ద్రవిడ్‌ను(Rahul Dravid New Coach) టీమిండియా కోచ్‌గా ఎంపిక చేయడం సరైన నిర్ణయమని మాజీ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్(MSK Prasad News) అన్నాడు. ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి పదవీకాలం టీ20 ప్రపంచకప్‌తో(T20 World Cup 2021) ముగుస్తున్న నేపథ్యంలో.. తదుపరి కోచ్‌గా ద్రవిడ్‌ని ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
"టీమిండియా కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ సరైన వ్యక్తి అని నేను గతంలోనే చెప్పాను. అతడు ఆటగాళ్లతో త్వరగా కలిసిపోగలడు. రవిశాస్త్రి నేతృత్వంలో టీమిండియా మెరుగ్గా రాణించింది. ఆస్ట్రేలియాలో సిరీస్ గెలిచింది. వరుసగా విజయాలు సాధించడమంటే మామూలు విషయం కాదు. ఇక ముందు కూడా ఇదే విజయ పరంపర కొనసాగించాలంటే.. కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ లాంటి వ్యక్తిని ఎంపిక చేయడం సరైన నిర్ణయం"
-- ఎమ్మెస్కే ప్రసాద్, మాజీ సెలెక్టర్.