Rahul Dravid Coach Tenure Extension :టీమ్ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవిని పొడగిస్తున్నట్లు బుధవారం బీసీసీఐ ప్రకటించింది. అయితే రీసెంట్గా ముగిసిన 2023 వరల్డ్‌కప్ టోర్నమెంట్‌తో రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ పూర్తైంది. దీంతో రాహుల్‌తో చర్చలు జరిపిన బీసీసీఐ.. ఏకగ్రీవంగా రాహుల్ పదవీ కాలాన్ని పొడగించినట్లు బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. టీమ్ఇండియాను అద్భుతంగా తీర్చిదిద్దడంలో రాహుల్ నైపుణ్యాలను బీసీసీఐ మెచ్చుకుంది. అలాగే ఎన్ఏసీ హెడ్‌గా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్‌ను సైతం బోర్డు ప్రశంసించింది. ఇక రాహుల్, లక్ష్మణ్.. ఇద్దరూ కలిసి టీమ్ఇండియాను అన్నివిధాలుగా ముందుకు తీసుకెళ్లాలని బీసీసీఐ సూచించింది. అలాగే ద్రవిడ్‌తో పాటు పురుషుల జట్టు సపోర్ట్ స్టాఫ్ కాంట్రాక్ట్‌ను కూడా బీసీసీఐ పొడగించింది.
ద్రవిడ్‌ను కొనసాగించాలనే బీసీసీఐ నిర్ణయానికి టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కూడా మద్దతుగా నిలిచారు. అలాగే ద్రవిడ్‌ను సౌతాఫ్రికా పర్యటనకు పంపించాలంటూ బీసీసీఐ భావిస్తోంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 10 నుంచి జనవరి 7 వరకు ద్రవిడ్ అక్కడికి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. "కాంట్రాక్ట్ కొనసాగింపుపై చర్చలు జరుగుతూనే ఉంటాయి. అయితే, సౌతాఫ్రీకాతో సిరీస్ చాలా కీలకం. ఈ పర్యటనలోని టీ20 సిరీస్‌కు వెళ్లకూడదని ద్రవిడ్ భావిస్తే.. వన్డేల నాటికి భారత జట్టుతో కలవచ్చు" అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
ఇక దక్షిణాఫ్రికా పర్యటనకు ద్రవిడ్‌నే పంపాలని యాజమాన్యం బలంగా భావిస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. అయితే లక్ష్మణ్‌కు అవకాశంపై స్పందిస్తూ.. అతడు ఇప్పటికే ఎన్‌సీఏ పనులతో బిజీగా ఉన్నాడని.. అండర్-19 వరల్డ్ కప్ కూడా దగ్గర పడుతున్న తరుణంలో సౌతాఫ్రికా పర్యటనకు పంపడం కష్టమేనని బీసీసీఐ అధికారులు తెలిపారు. ప్రస్తుతం లక్ష్మణ్ ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.