Jasprit Bumrah Dravid: భారత్-ఇంగ్లాండ్ మధ్య శుక్రవారం ప్రారంభమైన ఐదో టెస్టులో టీమ్ఇండియా కెప్టెన్ బాధ్యతలు.. ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వహిస్తున్న విషయంపై ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ బారిన పడడం వల్ల ఈ టెస్టుకు సారథిగా బుమ్రాకు అవకాశం దక్కింది. దాదాపు 35 ఏళ్ళ తర్వాత ఓ ఫాస్ట్ బౌలర్ టెస్టు జట్టుకు సారథ్య బాధ్యతలు దక్కడం ఇదే తొలిసారి. దీనిపై ద్రవిడ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బుమ్రా టీమ్ఇండియా సారథిగా కంటే బౌలర్‌గానే జట్టుకు బాగా అవసరమని అన్నాడు.
"బుమ్రా చాలా శ్రద్ధతో బాధ్యతలు నిర్వహించే వ్యక్తి. ఆట గురించి బాగా ఆలోచిస్తాడు. మ్యాచ్ కొనసాగుతున్న తీరును అతడు అర్థం చేసుకుంటాడు. ప్రత్యర్థుల బ్యాటింగ్‌కు తగ్గట్టు తాను ఎలా బౌలింగ్ చేస్తున్నాననే విషయాన్నీ తెలుసుకుంటాడు. ఆట గురించి చాలా ఆసక్తిగా అన్ని విషయాలు తెలుసుకుంటూ తోటి ఆటగాళ్లతో చర్చిస్తాడు. నాయకుడికి ఉండాల్సిన అన్ని లక్షణాలు బుమ్రాలో ఉన్నాయి"
-- రాహుల్ ద్రవిడ్, ప్రధాన కోచ్
గతంలో సారథిగా వ్యవహరించిన అనుభవం అంతగా లేకపోయినప్పటికీ బుమ్రాకు తాము మద్దతు తెలుపుతామని ద్రవిడ్ చెప్పాడు. ఒక ఫాస్ట్ బౌలర్ కెప్టెన్‌గా వ్యవహరించడం అంత సులభమైన విషయమేమీ కాదని తెలిపాడు. తన బౌలింగ్‌పై దృష్టి పెట్టడమే కాకుండా, అతడు బౌలింగ్ చేస్తున్న సమయంలో ఫీల్డింగ్‌ను సెట్ చేయాల్సి ఉంటుందని చెప్పాడు.
'అదొక అద్భుతం'.. ఇంగ్లాండ్‌తో టీమ్ఇండియా మొదటి టెస్ట్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న బుమ్రాపై ముంబయి ఇండియన్స్ కోచ్ మహేలా జయవర్ధనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవలే బుమ్రా భార్య సంజన గణేశన్‌తో ఐసీసీ నిర్వహించిన చిట్‌చాట్‌లో భాగంగా మాట్లాడిన జయవర్ధనే.. బుమ్రాను కెప్టెన్ గా నియమించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నాడు. "ఇది అద్భుతం అనే చెప్పాలి. ఎందుకంటే ఫాస్ట్ బౌలర్‌కు కెప్టెన్‌గా నియమించడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇక ఫాస్ట్ బౌలర్ జట్టు కెప్టెన్‌గా ఉండాలంటే ఎంతో కష్టపడాలి. టెస్టు క్రికెట్లో అయితే అనేక సవాళ్లతో కూడి ఉంటుంది. ఇక బుమ్రా టెస్టు కెప్టెన్సీకి సరైనవాడు. గత కొన్నేళ్లుగా ట్రెండ్ మారుతోంది. ఆస్ట్రేలియాకు పాట్ కమిన్స్ కెప్టెన్‌గా మారిన తర్వాత మిగతా దేశాల క్రికెట్ బోర్డులు అదే దారిలో వెళ్లేందుకు ఆలోచన చేస్తున్నాయి." అని జయవర్థనే చెప్పుకొచ్చాడు.
ఇవీ చదవండి:శతక్కొట్టిన పంత్.. ధోనీ రికార్ఢు బద్దలు.. జట్టుకు ఆపద్బాంధవుడిగా..
చెలరేగిన పంత్, జడేజా.. తొలి రోజు ఆట ముగిసే సరికి..