Dravid about Kohli: పదేళ్ల టెస్టు కెరీర్లో విరాట్ కోహ్లీ ఆటగాడిగా ఎంతో పరిణతి సాధించాడని టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో ఒక్కో మెట్టు ఎక్కుతూ కెప్టెన్ స్థాయికి ఎదగడం అద్భుతమని పేర్కొన్నాడు. ద్రవిడ్ ఇటీవల బీసీసీఐకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కోహ్లీ గురించి పలు విషయాలు వెల్లడించాడు.
"2011లో విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్లోకి అరంగేట్రం చేసే నాటికి.. నేను ఇంకా క్రికెట్లో కొనసాగుతూనే ఉన్నాను. అతడితో కలిసి కొన్ని మ్యాచులు కూడా ఆడాను. ఈ పదేళ్ల కాలంలో కోహ్లీ ఒక ఆటగాడిగా, పరిపూర్ణమైన వ్యక్తిగా ఎంతో పరిణతి సాధించాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ కెప్టెన్ స్థాయికి ఎదగడం అద్భుతంగా అనిపిస్తోంది. ఆటలో పర్‌ఫెక్షన్ కోసం ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటాడు. ఓ నాయకుడిగా ఆటగాళ్ల ఫిట్‌నెస్ విషయంలో చాలా విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాడు."