Rahkeem Cornwall Cpl Century :కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2023లో 12 సిక్స్‌లతో విధ్వంసం సృష్టించాడు వెస్టిండీస్ ప్లేయర్ రఖీమ్ కార్న్‌వాల్. సెంయిట్ కిట్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో బార్బడోస్ రాయల్స్ ఆల్ రౌండర్ రఖీమ్.. 45 బంతుల్లోనే సెంచరీ బాదాడు. ఈ శతకంతో సీపీఎల్‌లో ఇప్పటివరకు అత్యంత వేకంగా సెంచరీ బాదిన మూడో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అయితే టీ20ల్లో రఖీమ్‌కు ఇది తొలి సెంచరీ కావడం గమనార్హం.
Caribbean Premier League 2023 :కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా సోమవారం బార్బడోస్ రాయల్స్, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియాట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సెయింట్ కిట్స్ విధించిన 221 పరుగుల లక్ష్యాన్ని.. 18.1 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది రాయల్స్. ఇందులో ఓపెనర్ రఖీమ్ విధ్వంసకర ప్రదర్శనతో 48 బంతుల్లో నాలుగు ఫోర్లు, 12 సిక్సర్లో 102 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ కేల్ మేయర్స్ (13 బంతుల్లో 5 ఫోర్లు, 22) పరుగులకు పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత లూరీ ఈవన్స్ కూడా 24 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన పావెల్ 26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 49పరుగులతో మెరిసి కాస్తలో అర్ధ సెంచరీని మిస్ అయ్యాడు. చివరకు అలిక్ 10 బంతుల్లో 1x4 సాయంతో 13* మ్యాచ్‌ను ముగించాడు. ఇక సెంయిట్స్ కిట్స్ బౌలర్లలో కార్బిన్ బోశ్, డొమినిక్ డ్రేక్స్ చెరో వికెట్ తీశారు.