తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత​ ఫ్యాన్స్​పై జాత్యహంకార వ్యాఖ్యలు.. స్పందించిన ఇంగ్లాండ్‌ బోర్డు

టీమ్​ఇండియా-ఇంగ్లాండ్​ మధ్య జరుగుతున్న మ్యాచ్​లో భారత అభిమానుల పట్ల పలువురు జాతి విద్వేష వ్యాఖ్యలు చేయడంపై ఇంగ్లాండ్​ క్రికెట్​ బోర్డు అప్రమత్తమైంది. దీనిపై విచారణ చేయించి చర్యలు చేపడతానని చెప్పింది.

IND VS ENG Racist
భారత​ ఫ్యాన్స్​పై జాత్యహంకార వ్యాఖ్యలు

By

Published : Jul 5, 2022, 1:58 PM IST

ఇంగ్లాండ్‌లో మరోసారి 'జాత్యహంకార' సంఘటన తలెత్తెంది. దీంతో ఆ దేశ క్రికెట్ బోర్డు అప్రమత్తమైంది. తాజాగా టీమ్​ఇండియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్‌ వేదిక ఎడ్జ్‌బాస్టన్‌ స్టేడియంలోనూ జాత్యహంకార ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. భారత అభిమానుల పట్ల పలువురు జాతి విద్వేష వ్యాఖ్యలు చేసినట్లు సోషల్‌ మీడియాలో వీడియో వైరల్​ అయింది. దీనిపై స్పందించిన నెటిజన్లు.. ఈ ఘటనపై విమర్శలు చేశారు. దీంతో ఇంగ్లాండ్ క్రికెట్‌ బోర్డు స్పందించింది.

"టెస్టు మ్యాచ్‌ సందర్భంగా జాత్యహంకార వేధింపులకు సంబంధించి నివేదికను పరిశీలించి చర్యలు తీసుకుంటాం. సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపడతాం. క్రికెట్‌లో వీటికి చోటు లేదు" అని ట్వీట్​ చేసింది. జాత్యంహకార సంఘటన తలెత్తిన నేపథ్యంలో నెటిజన్లు తీవ్రస్థాయిలో స్పందించారు. ఇటువంటి సంఘటనలను ఉపేక్షించకూడదని ఖండించారు. ఇటీవలే కౌంటీల్లోనూ జాత్యహంకార​ ఆరోపణలతో మాజీ క్రికెటర్ అజీమ్‌ రఫీఖ్‌ వ్యవహారం సంచలనం రేపింది. అతడు కూడా తాజా ఘటనపై అజీమ్‌ రఫీఖ్ కూడా ట్వీట్‌ చేశాడు. దీనిపై ఎడ్జ్‌బాస్టన్‌ క్రికెట్ క్షమాపణలు చెప్పింది. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఈ ధోరణిని సహించేదిలేదని స్పష్టం చేసింది. సంఘటనపై విచారణ చేపడతామని వెల్లడించింది. ఎడ్జ్‌బాస్టన్‌లో ఆహ్లాదకర వాతావరణం ఉండేలా చూస్తామని, ట్వీట్లు చేసిన సదరు వ్యక్తితో పర్సనల్‌గా మాట్లాడినట్లు సీఈవో స్టువర్ట్‌ కెయిన్‌ తెలిపారు.

ఇదీ చూడండి: బుమ్రా ఖాతాలో మరో రికార్డు.. కపిల్​, కుంబ్లే సరసన చోటు

ABOUT THE AUTHOR

...view details