Rachin Ravindra World Cup 2023 :2023 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ యంగ్ బ్యాటర్ రచిన్ రవీంద్రఅదరగొడుతున్నాడు. తాజాగా శనివారం పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో రచిన్.. శతకంతో చెలరేగిపోయాడు. అతడు పాక్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ.. బౌండరీల మోత మోగించాడు. తన భీకర ఆటతో జట్టు భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో రచిన్, క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు.
ప్రస్తుత టోర్నీమెంట్లో రచిన్‌కు ఇది మూడో సెంచరీ. ఈ క్రమంలో ప్రపంచకప్ టోర్నీలో అతి తక్కువ వయసులో, అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఇదివరకు ఈ రికార్డు సచిన్ పేరిట ఉండేది. వరల్డ్‌కప్‌లో సచిన్ 22 ఏళ్ల వయసువలో 2 సెంచరీలు బాదాడు. కాగా, రచిన్ 23 ఏళ్ల 351 రోజుల వయసులో 3 శతకాలు నమోదు చేసి ఆ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
అంతేకాకుండా ఒకే వరల్డ్‌కప్ ఎడిషన్‌లో ఎక్కువ సెంచరీలు బాదిన కీవీస్ బ్యాటర్‌గానూ రచిన్ రికార్డు కొట్టాడు. గతంలో 1975 వరల్డ్‌కప్‌లో గ్లెన్ టర్నర్ (2), 2015లో మార్టిన్ గప్టిల్ (2), 2019లో విలియమ్సన్ (2) బాదారు. కాగా, ఈ ఎడిషన్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన రచిన్.. 74.71 సగటుతో 523 పరుగులు సాధించాడు.