టీమ్ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు పాకిస్థాన్ మాజీ బౌలర్ సయీద్ అజ్మల్. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌పై కూడా విమర్శలు కురిపించాడీ పాక్ క్రికెటర్.
అశ్విన్ బౌలింగ్ యాక్షన్ కారణంగా అతనిపై ఐసీసీ నిషేధం విధించాల్సి ఉందని పేర్కొన్నాడు. అందుకే అతన్ని కొంతకాలం క్రికెట్ నుంచి ఉద్దేశపూర్వకంగా తప్పించారని అజ్మల్ ఆరోపించాడు. ఐసీసీ వేర్వేరు క్రికెటర్లకు విభిన్న నిబంధనలు అమలు చేస్తుందని తెలిపాడు.
"ఐసీసీ.. ఎవరిని అడిగి నిబంధనలు మారుస్తుంది. నేను గత 8 ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్నా. ఇవన్నీ నా కోసమేనా. నాకైతే అలానే అనిపిస్తుంది. నిషేధం విధించిన ఆ ఆరు నెలలు అశ్విన్‌ను ఉద్దేశపూర్వకంగా క్రికెట్‌కు దూరంగా ఉంచారు. ఎందుకలా చేశారు? మీ బౌలర్‌ను సస్పెండ్ కాకుండా ఉండటానికి. ఒక పాకిస్థాన్ బౌలర్‌పై నిషేధం విధిస్తే వారికేంటి. వారికి కావాల్సింది డబ్బులు మాత్రమే."
-సయీద్ అజ్మల్, పాకిస్థాన్ క్రికెటర్.