తెలంగాణ

telangana

ETV Bharat / sports

అశ్విన్​ విశ్వరూపం.. ఆ కామెంట్లపై ఘాటు స్పందన.. భారత జెర్సీ ధరించినప్పటి నుంచి అంటూ.. - అతిగా ఆలోచిస్తాడు కామెంట్లు అశ్విన్

బంగ్లాదేశ్‌పై అద్భుత విజయం సాధించడంలో రవిచంద్రన్ అశ్విన్‌ది కీలక పాత్ర. బౌలింగ్‌లోనే కాకుండా కీలక సమయంలో బ్యాటింగ్‌లోనూ రాణించి ఓటమి నుంచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అయితే తనపై వచ్చే విమర్శలకు ఎప్పటికప్పుడు తన ఆటతోనే కాకుండా సోషల్‌ మీడియాలోనూ సమాధానం ఇస్తుంటాడు. తాజాగా అలాగే మరోసారి స్పందించాడు.

r ashwin sends strong worded message
r ashwin sends strong worded message

By

Published : Dec 26, 2022, 10:40 PM IST

సోషల్‌ మీడియాలో అత్యంత చురుగ్గా ఉండే క్రికెటర్లలో టీమ్‌ఇండియా సీనియర్‌ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్‌ ఒకడు. విభిన్న అంశాలపై చర్చలు నిర్వహిస్తూ.. అభిమానుల సందేహాలకు సమాధానాలు ఇస్తుంటాడు. తాజాగా బంగ్లాదేశ్‌పై రెండో టెస్టులో భారత్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆధునిక క్రికెట్‌లో అత్యుత్తమ బ్రెయిన్‌గా పరిగణించే అశ్విన్‌ కూడా కొన్నిసార్లు అతిగా ఆలోచించేవాడిగా కనిపిస్తాడనే వాదనా ఉంది. దీంతో ఇలాంటి కామెంట్లపై అశ్విన్‌ సోషల్‌ మీడియా వేదికగా సుదీర్ఘ వివరణ ఇచ్చాడు.

అశ్విన్‌

''అతిగా ఆలోచించడం అనేది నేను భారత జెర్సీని ధరించినప్పటి నుంచి నేను అనుసరించిన విధానం. అయితే ఇప్పుడు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ మార్గంలో ఆలోచించాను. కానీ అభిమానుల మనస్సులో నుంచి ఆ పదం తొలగించడానికి నా పీఆర్‌ టీమ్‌ కాస్త సీరియస్‌గా దృష్టి సారించాలి. ఇక్కడ ప్రతి వ్యక్తి గమనం ప్రత్యేకంగా ఉంటుంది. అయితే కొందరు మాత్రం అతిగా ఆలోచిస్తూ ఉంటారు. మరికొందరు చాలా సింపుల్‌గా ఉంచుకోగలరు. బయట నుంచి నాపై 'అతిగా ఆలోచిస్తాడు' అంటూ వ్యాఖ్యలు చేస్తుంటారు. అలా అన్నప్పుడు నేను కూడా దాని గురించి ఆలోచిస్తుంటా. అయితే నేను ఆడే విధానంపై నాకంటూ స్పష్టత ఉంటుంది. ఇలాగే ఆడాలని ఇతరులను రికమండ్‌ చేయను''

అశ్విన్‌

''నా గేమ్‌ గురించి లోతుగా ఆలోచిస్తా. అలాగే నా అభిప్రాయాలను అందరితో పంచుకుంటా. అవన్నీ జనాదరణ పొందకపోవచ్చు. కానీ నేను మాటల యుద్ధంలో గెలవాలని అనుకోవడం లేదు. అలా పంచుకోవడం వల్ల వచ్చే దాని నుంచి నేర్చుకోవడానికి మాత్రమే చూస్తా. చివరిగా నేను ఇక్కడ ఓ గమనిక పెడుతున్నా. నా సహచరులు, అభిమానులు లేదా ఇతరుల నుంచి నాకెలాంటి సమస్య లేదు. ఇలా నేను ట్వీట్లు పెట్టడానికి కారణం కూడా ఉంది. గత కొంతకాలంగా వస్తున్న కొన్ని ఆర్టికల్స్‌పై స్పందించాల్సిన బాధ్యత నాపై ఉంది. అందుకే ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది. 'అతిగా ఆలోచిస్తాడు' అనే పదం ముప్పుగా మారుతుందని అర్థం చేసుకోవడానికి నాకు దాదాపు 13 సంవత్సరాలు పట్టింది. అందుకే నేను పెట్టిన ట్వీట్లను చదివిన కొంతమంది యువకులకైనా కొన్నేళ్ల తర్వాత నేర్చుకొంటారని ఆశిస్తున్నా'' అని అశ్విన్‌ సుదీర్ఘంగా పోస్టులు పెట్టాడు.

అశ్విన్‌ గత కొంతకాలంగా జట్టుకు భారంగా మారాడనే విమర్శలు వచ్చాయి. టీ20 ప్రపంచకప్‌లో పెద్దగా రాణించకపోయినా అన్ని మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం అశ్విన్‌కు దక్కింది. అలాగే యువ స్పిన్నర్లను కాదని సీనియర్‌కు చోటు కల్పించడంపైనా విమర్శలు రేగాయి. ఈ క్రమంలో తనకు తాను ఎక్కువగా అంచనా వేసుకొంటూ 'అతిగా ఆలోచిస్తున్నాడు' అంటూ పలు కామెంట్లు రావడంతో అశ్విన్‌ ఘాటుగా స్పందించాడు.

ABOUT THE AUTHOR

...view details