తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఇంగ్లాండ్​ సిరీస్​కు ముందు అశ్విన్​కు ఆ ఛాన్స్​!

ఇంగ్లాండ్​తో సిరీస్​కు ముందు టీమ్​ఇండియా సీనియర్​ స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్​కు(Ravichandran Ashwin) కౌంటీ మ్యాచ్​ ఆడే అవకాశం దొరికింది!. అన్నీ అనుకున్నట్లు జరిగితే జులై 11న సర్రే తరఫున ఈ మ్యాచ్​ అతడు ఆడతాడు. దీంతో సిరీస్​కు ముందు అతడికి విలువైన మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లభించినట్లవుతుంది.

ashwin
అశ్విన్​

By

Published : Jul 7, 2021, 4:31 PM IST

ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీసుకు ముందు టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు(Ravichandran Ashwin) ఓ అవకాశం దొరికింది. అన్నీ సవ్యంగా కుదిరితే అతడు జులై 11న సర్రే తరఫున కౌంటీ మ్యాచ్‌ ఆడనున్నాను. దీంతో ప్రతిష్ఠాత్మక సిరీసుకు ముందు అతడికి మంచి మ్యాచ్‌ ప్రాక్టీస్‌ దొరకనుంది.

ప్రస్తుతం టీమ్‌ఇండియా(Teamindia) ఆటగాళ్లంతా విరామంలో ఉన్నారు. వారితో పాటే అశ్విన్‌ సైతం కుటుంబంతో కలిసి బ్రిటన్‌లో పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తున్నాడు. గతంలో కౌంటీ క్రికెట్లో నాటింగ్‌హామ్‌ షైర్‌, వొర్సెస్టర్‌షైర్‌కు ఆడిన అనుభవం యాష్‌కు ఉంది. ఒకవేళ సర్రే తరఫున సోమర్‌సెట్‌పై ఓవల్‌లో ఆడే అవకాశం దొరికితే అతడికి విలువైన మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లభించినట్టే. పైగా ఇదే మైదానంలో టీమ్‌ఇండియా ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టు ఆడనుంది.

జులై 11న ఆరంభమయ్యే కౌంటీ మ్యాచుపై యాష్‌తో పాటు సర్రే సైతం ఆశలు పెట్టుకున్నట్టు తెలిసింది. సమయానికి అనుగుణంగా అన్ని పనులు సవ్యంగా జరుగుతాయని వారు ఆశాభావంతో ఉన్నారు. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఓటమి తర్వాత సారథి విరాట్‌ కోహ్లీ సన్నాహక మ్యాచుల గురించి ప్రశ్నించాడు. ఈ నేపథ్యంలో యాష్‌కు సరైన సమయంలో సరైన అవకాశం లభించినట్టైంది.

ఇదీ చూడండి: ఖేల్​రత్న పురస్కారం కోసం అశ్విన్, మిథాలీ

ABOUT THE AUTHOR

...view details