Quinton De Kock News: దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ క్వింటన్ డికాక్ తండ్రి అయ్యాడు. అతడి భార్య సాషా గురువారం ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు డికాక్ ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేశాడు. తమ కూతురుకి కియారా అనే పేరు పెట్టినట్లు వెల్లడించాడు. సాషా, కియారాతో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు డికాక్. అయితే.. ఇటీవలే తన భార్యతో సమయం గడిపేందుకు టెస్టు క్రికెట్‌కు కూడా గుడ్‌బై చెప్పేశాడు డికాక్.
టీమ్ఇండియా దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా డికాక్ తొలి టెస్టు అడిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు. అయినప్పటికీ భారత్‌తో వన్డే సిరీస్‌లో డికాక్‌కు చోటు లభించింది.
రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్‌పై విజయం సాధించి సిరీస్‌ను సమం చేసింది దక్షిణాఫ్రికా. మూడో టెస్టు కేప్‌టౌన్ వేదికగా జనవరి 11 నుంచి జరగనుంది.