బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్.. పీవీ సింధు ఆటలోనే కాదు డ్యాన్స్‌లోనూ అదరగొడుతోంది. ఓ వైపు బ్యాడ్మింటన్ కోర్టులో సంచలనాలు నమోదు చేస్తున్న ఈ స్టార్ ప్లేయర్.. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు కెరీర్ విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. బ్యూటిఫుల్ ఫొటోలను షేర్ చేస్తుంటుంది. అప్పుడప్పుడూ సినిమా పాటలకు డ్యాన్సులు చేస్తూ ఆ వీడియోలను కూడా పోస్ట్ చేస్తుంటుంది.
'బాస్ పార్టీ' సాంగ్‌కు పీవీ సింధు అదిరిపోయే స్టెప్పులు.. గంటలోనే 2.5 లక్షల లైకులు! - పీవీ సింధు బాస్పార్టీ సాంగ్
బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధు డ్యాన్స్‌తో అదరగొట్టింది. వాల్తేరు వీరయ్య సినిమాలోని 'బాస్ పార్టీ' సాంగ్‌కు స్టెప్పులతో ఫిదా చేసింది. ఓ సారి ఆ వీడియోను మీరూ చూసేయండి.
తాజాగా ఓ డ్యాన్స్ వీడియోను సింధు షేర్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలోని బాసు.. వేర్ ఈజ్ ద పార్టీ పాటకు హుషారుగా స్టెప్పులేసింది. బ్లూ కలర్ ఎంబ్రాయిడరీ లెహంగాలో ఎంతో స్టైలిష్‌గా కనిపించింది సింధు. ప్రస్తుతం ఈ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోను షేర్ చేసిన కొన్ని గంటల్లోపే 2.5 లక్షలకుపైగా లైకులు వచ్చాయి. వేలాది కామెంట్లు కూడా వచ్చాయి.
'సింధూ.. మీ డ్యాన్సింగ్ ట్యాలెంట్ అదుర్స్.. నిన్ను త్వరలోనే టాలీవుడ్‌లో చూడాలనుకుంటున్నాం' అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే సింధు డ్యాన్స్‌లు, ఫొటోషూట్‌లు చూస్తుంటే సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేస్తుందని వార్తలు కూడా వచ్చాయి. అయితే వీటిని కొట్టిపారేసింది బ్యాడ్మింటన్ స్టార్. తన ధ్యాసంతా ఆటపైనే ఉందంటూ స్పష్టం చేసింది. ప్రస్తుతం సింధు.. ఆసియా మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఆడుతోంది. క్వార్టర్ ఫైనల్స్‌లో సత్తా చాటి సెమీస్‌లోకి దూసుకెళ్లింది.