Pujara Suspension : టీమ్ఇండియా టెస్ట్ ప్లేయర్, నయా వాల్ ఛెతేశ్వర్ పుజారాపై వేటు పడింది. ఇంగ్లాండ్ కౌంటీ ఛాంపియన్‌షిప్ 2023లో అతడు కెప్టెన్సీ వహిస్తున్న ససెక్స్ టీమ్‌కు 12 పాయింట్లు పెనాల్టీ పడింది. దీని ఎఫెక్ట్ సారథైన పుజారాపై పడింది. అతడి ఓ మ్యాచ్ సస్పెన్షన్ విధిస్తున్నట్లు కౌంటీ ఛాంపియన్‌షిప్ నిర్వాహకులు వెల్లడించారు.
ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు నిబంధనల ప్రకారం.. ఓ సీజన్‌లో ఓ టీమ్‌పై నాలుగు ఫిక్స్‌డ్ పెనాల్టీలు పడితే, సదరు టీమ్ కెప్టెన్‌పై ఓ మ్యాచ్ సస్పెన్షన్ వేటు పడుతుంది. ప్రస్తుత సీజన్‌లో ససెక్స్ నాలుగు ఫిక్స్‌డ్ పెనాల్టీలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అందుకే పుజారాపై వేటు పడింది. టోర్నీ తొలి లెగ్‌లో రెండు ఫిక్స్‌డ్ పెనాల్టీలను ఎదుర్కొన్న ససెక్స్.. సెప్టెంబర్ 13న లీసెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ మరో రెండు పెనాల్టీలను అందుకుంది. దీంతో ఆ జట్టుకు మొత్తం 12 డీమెరిట్ పాయింట్లు ఇవ్వడం జరిగింది.
ప్లేయర్లు ఆన్ ఫీల్డ్ బిహేవియర్ నిబంధనలకు విరుద్ధంగా ఉండటంటో ససెక్స్‌పై అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. రీసెంట్గా లీసెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో ససెక్స్ ప్లేయర్స్ టామ్ హెయిన్స్, జాక్ కార్సన్, అరి కార్వెలాస్‌లు స్టేడియంలో వ్యవహరించిన తీరుకు కెప్టెన్ పుజారా బాధ్యుడవ్వాల్సి వచ్చింది. పుజారా సస్పెన్షన్‌ను ససెక్స్ యాజమాన్యం కూడా ఎలాంటి వాదనలు లేకుండానే స్వీకరించింది.