Pujara Rizwan: టీమ్ఇండియా టెస్టు స్పెషలిస్ట్ ఛెతేశ్వర్ పుజారా, పాకిస్థాన్‌కు చెందిన మహ్మద్ రిజ్వాన్ ఒకే జట్టు తరఫున బరిలోకి దిగుతున్నారు. ఇంగ్లాండ్‌లో జరుగుతున్న కౌంటీ క్రికెట్ కోసం వీరు ససెక్స్ జట్టు తరఫున గురువారం అరంగేట్రం చేశారు. కౌంటీల్లో గతంలో యార్క్‌షైర్‌కు ఆడిన అనుభవం పుజారాకు ఉంది. కాగా కౌంటీల్లో ఆడటం రిజ్వాన్‌కు ఇదే తొలిసారి.
టామ్ డెయిన్స్ కెప్టెన్సీలో పుజారా-రిజ్వాన్ ఇద్దరూ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. ప్రత్యర్థి డెర్బిషైర్ బ్యాటింగ్ ఎంచుకోగా, వీరు రెండో రోజున కలిసి బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. చూడముచ్చటగా ఉందని పలువురు కామెంట్లు పెడుతుంటే.. పరిస్థితులు మెరుగుపడి భారత్-పాక్ మధ్య మ్యాచ్‌లు జరగాలని మరికొందరు ఆశిస్తున్నారు.