తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలిగా పీటీ ఉష.. 95 ఏళ్ల చరిత్ర తిరగరాసిన పరుగుల రాణి - పీటీ ఉష ప్రెసిడెంట్​

పరుగుల రాణి పీటీ ఉష అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. భారత ఒలింపిక్​ సంఘం అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఈ మేరకు కేంద్రమంత్రి కిరణ్​ రిజిజు ఆమెకు అభినందనలు తెలిపారు.

PT Usha elected as President of Indian Olympic Association
PT Usha elected as President of Indian Olympic Association

By

Published : Nov 28, 2022, 2:19 PM IST

IOA President PT Usha: భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలిగా పరుగుల రాణి పీటీ ఉష ఏకగ్రీవంగా ఎన్నికైంది. 95 ఏళ్ల చరిత్రను ఆమె తిరగరాసింది. ఎందుకంటే ఇప్పటి వరకు ఐఓఏ అధ్యక్షురాలిగా మహిళలు ఎన్నడూ లేరు. అయితే అధ్యక్ష పదవికి మరెవరూ నామినేషన్​ వేయకపోవడంతో ఆమెకే అత్యున్నత పదవి వరించింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్​ రిజిజు ట్వీట్​ చేశారు. పీటీ ఉషకు శుభాకాంక్షలు తెలిపారు.

"భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలిగా ఎన్నికైనందుకు దిగ్గజ గోల్డెన్ గర్ల్ శ్రీమతి పీటీ ఉషకు అభినందనలు. ప్రతిష్ఠాత్మక ఐఓఏకు ఆఫీస్ బేరర్లు అయినందుకు క్రీడాకారులందరినీ అభినందిస్తున్నాను. మీ అందర్నీ చూసి దేశం గర్విస్తోంది"

- కిరణ్​ రిజిజు, కేంద్ర మంత్రి

భారత ఒలింపిక్ సంఘం అధ్యక్ష ఎన్నికలకు పీటీ ఉష ఇటీవలే నామినేషన్ దాఖలు చేశారు. ఆమెతో పాటు 14 మంది కార్యవర్గ సభ్యులు కూడా వివిధ పదవులకు నామినేషన్లు సమర్పించారు. అధ్యక్ష పదవికి మాత్రం ఎవరూ నామినేషన్​ వేయలేదు. దీంతో పీటీ ఉష ఎన్నిక లాంఛనమైంది. ఇప్పటివరకు పీటీ ఉష వివిధ ఆసియా గేమ్స్​లో గోల్డ్​ మెడల్స్​ సాధించారు. 1984లో జరిగిన ఒలింపిక్స్​లో 400 మీటర్ల హర్డల్స్ ఈవెంట్​​ ఫైనల్​లో నాలుగో స్థానంలో నిలిచారు.

ఇండియన్ ఒలింపిక్​ అసోసియేషన్​లోని అధ్యక్ష పదవి మినహా వివిధ స్థానాలకు డిసెంబరు 10న ఎన్నికలు జరగనున్నాయి. సీనియర్ వైస్​ ప్రెసిడెంట్, రెండు వైస్​ ప్రెసిడెంట్ స్థానాలు(ఒకటి పురుషులకు, ఒకటి మహిళ), కోశాధికారి, రెండు జాయింట్​ సెక్రటరీ స్థానాలు(పురుషుడు, మహిళ), 6 కార్యనిర్వాహక మండలి సభ్యుల స్థానాలు ఉన్నాయి. ఈ ఆరుగురిలో ఇద్దరు అథ్లెట్స్​ కమిషన్ ప్రతినిధులు ఉంటారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details