తెలంగాణ

telangana

ETV Bharat / sports

లంకలో అదుర్స్.. ఇంగ్లాండ్​ పర్యటనకు​ సూర్యకుమార్​

శ్రీలంక పర్యటనలో అదరగొడుతున్న సూర్యకుమార్​ అద్భుత అవకాశం దక్కించుకున్నాడు. పలువురు క్రికెటర్లు గాయపడిన కారణంగా ఇంగ్లాండ్​తో టెస్టు సిరీస్​ కోసం అతడిని ఎంపిక చేసినట్లు బోర్డు వెల్లడించింది.

surya kumar yadav, prithvi shaw
సూర్యకుమార్ యాదవ్, పృథ్వీ షా

By

Published : Jul 26, 2021, 2:10 PM IST

ఇంగ్లాండ్​తో టెస్టు సిరీస్​ కోసం భారత జట్టులో పలు మార్పులే చేసింది బీసీసీఐ. పలువురు ఆటగాళ్లు గాయల బారిన పడిన నేపథ్యంలో కొత్త జట్టును వెల్లడించింది. ఓపెనర్​ శుభ్​మన్​ గిల్​, ఆల్​రౌండర్​ వాషింగ్టన్​ సుందర్, ఫాస్ట్​ బౌలర్ అవేశ్​ ఖాన్​ గాయాల కారణంగా ఇంగ్లాండ్ పర్యటన నుంచి వైదొలిగారు. వీరి స్థానంలో ఓపెనర్​ పృథ్వీ షా, సూర్యకుమార్​ యాదవ్​ల పేర్లను చేర్చింది.

ఆల్​రౌండర్​ వాషింగ్టన్​ బౌలింగ్ చేతికి ఇంజెక్షన్​ తీసుకున్నాడు. అయితే అతడు కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. వార్మప్​ మ్యాచ్​ సందర్భంగా బౌలర్​ అవేశ్ ఖాన్ బొటనవేలికి గాయమైంది. ఎక్స్​ రేలో వేలికి ఫ్రాక్చర్​ అయినట్లు తేలింది. అతడు ప్రస్తుతం నిపుణుల పర్యవేక్షణలో ఉన్నాడు. మరో బ్యాట్స్​మన్​ శుభ్​మన్​ గిల్​ కాలి గాయంతో బాధపడుతున్నాడు. దీంతో ఇంగ్లాండ్ పర్యటన నుంచి తప్పుకొన్నాడు.

జట్టుతో చేరిన పంత్​..

కొవిడ్ నుంచి కోలుకున్న వికెట్ కీపర్ రిషభ్ పంత్​ తిరిగి జట్టుతో చేరాడు. రెండు సార్లు ఆర్టీ-పీసీఆర్​ పరీక్షలు చేయించుకున్న పంత్​.. వాటిల్లో నెగెటివ్​ వచ్చిన అనంతరమే భారత బృందంతో కలిశాడు. పంత్​తో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్​, వృద్ధిమాన్ సాహా, అభిమన్యు ఈశ్వరన్​ కూడా కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఐసోలేషన్​ పూర్తి చేసుకున్న వీరంతా తిరిగి జట్టుతో చేరారు.

భారత బృందం..

రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ(కెప్టెన్), అజింక్య రహానె(వైస్ కెప్టెన్), హనుమ విహారి, రిషభ్ పంత్(వికెట్ కీపర్), అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్​ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహమ్మద్​ షమి, మహమ్మద్ సిరాజ్, శార్దుల్ ఠాకుర్​, ఉమేశ్ యాదవ్, కేఎల్ రాహుల్, వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), అభిమన్యు ఈశ్వరన్, పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్.

స్టాండ్ బై ప్లేయర్లు..ప్రసిధ్ కృష్ణ, అర్జాన్​ నగ్వాస్వల్లా.

​ఇదీ చదవండి:భారత్ క్రికెటర్ నోట లంక జాతీయ గీతం

ABOUT THE AUTHOR

...view details