Prithvi Shaw Injured : భీకర ఫామ్‌లో టీమ్ఇండియా యంగ్ ఓపెనర్, నార్తంప్టన్‌షైర్ స్టార్ ప్లేయర్ పృథ్వీ షా.. రాయల్ లండన్ వన్డే కప్-2023 నుంచి అర్థంతరంగా వైదొలిగాడు.. నిష్క్రమించాడు. ఈ టోర్నీలో విధ్వంసకర డబుల్ సెంచరీతో పాటు మెరుపు సెంచరీ బాది ఫుల్ ఫామ్‌లో ఉన్న అతడు ఇప్పుడు గాయపడ్డాడు. డర్హమ్‌తో జరిగిన మ్యాచ్‌లో సందర్భంగా ఫీల్డింగ్ చేస్తూ ఈ సంఘటన జరిగింది. ముందుగా అంచనా వేసిన దాని కన్నా గాయం తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో అతడు(prithvi shaw injury update) ఈ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.
షా ప్రాతినిధ్యం వహిస్తున్న నార్తంప్టన్ యాజమాన్యం ఈ విషయాన్ని అధికారికంగా సోషల్‌మీడియా ద్వారా తెలిపింది. "ఇది నిజంగా బాధాకరం. రాయల్ లండన్ వన్డే కప్‌లోని నెక్ట్స్ మ్యాచ్‌లకు పృథ్వీ షా అందుబాటులో ఉండకపోవచ్చు. అతడు డర్హమ్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు." అని పేర్కొంది. అయితే షాకు తగిలిన గాయం.. స్కాన్ రిపోర్ట్‌ల్లో చాలా తీవ్రంగా ఉందని సమాచారం అందింది. అతడు త్వరలో లండన్‌లో బీసీసీఐ ఆధ్వర్యంలోని స్పెషలిస్ట్ డాక్టర్‌ను కలుస్తాడని తెలిసింది.
పూరించలేని లోటు.. ఇకపోతే... తాజా టోర్నీలో ఇప్పటివరకు అతడు లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. నాలుగు మ్యాచుల్లో ద్వి శతకం, ఓ శతకం సాయంతో 429 పరుగులు చేశాడు. దీంతో అతడు జట్టులో లేకపోవడం పూరించలేని లోటని అభిమానులు అంటున్నారు. అతి తక్కువ వ్యవధిలోనే పృథ్వీ నార్తంప్టన్‌షైర్ జట్టుపై మంచి ప్రభావం చూపాడని.. ఆ జట్టు కోచ్ జాన్ సాడ్లర్ కూడా ట్వీట్‌లో వ్యాఖ్య రాసుకొచ్చాడు.