తెలంగాణ

telangana

ETV Bharat / sports

Prithvi Shaw Hit Wicket : పాపం షా.. అరంగేట్ర మ్యాచ్​లో చేదు అనుభవం - prithvi shaw latest news

Prithvi Shaw Hit Wicket : ఫామ్​లేమితో జట్టులో స్థానం కోల్పోయిన పృథ్వీ.. ఇంగ్లాండ్ బాట పట్టాడు. కౌంటీల్లో అయినా రాణించి మళ్లీ టీమ్ఇండియా జట్టులో చోటు దక్కించుకోవాలని ఆరాటరపడుతున్నాడు. కాగా నార్తాంప్టన్ షైర్​ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న పృథ్వీ.. అరంగేట్ర మ్యాచ్​లో క్రీజులో కుదురుకున్నాక.. ఊహించని రీతిలో ఔటైయ్యాడు.

Prithvi Shaw Hit Wicket
కౌంటీల్లో పృథ్వీ షా హిట్​ వికెట్​

By

Published : Aug 5, 2023, 2:41 PM IST

Prithvi Shaw Hit Wicket : టీమ్ఇండియా జట్టులో రీ ఎంట్రీయే టార్గెట్​గా కెరీర్​ ప్లాన్ చేసుకున్నాడు పృథ్వీ షా. అందులో భాగంగానే ఇంగ్లాండ్ కౌంటీల్లో నార్తాంప్టన్ షైర్​ జట్టులో ఆడేందుకు ఒప్పుందం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ పయణమయ్యాడు పృథ్వీ. అయితే అక్కడ ప్రాక్టీస్​ మ్యాచ్​లో 65 పరుగులతో రాణించిన పృథ్వీ.. నార్తాంప్టన్ షైర్​ - గ్లౌసెస్టర్ షైర్ మ్యాచ్​తో అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్​లో 279 పరుగుల లక్ష్య ఛేదనలో నార్తాంప్టన్ షైర్ తరఫున పృథ్వీ ఓపెనర్​గా బరిలోకి దిగాడు.

అయితే ఛేజింగ్ చేసే క్రమంలో నార్తాంప్టన్.. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఈ దశలో 34 బంతుల్లో 34 పరుగులు చేసి క్రీజులో కుదురుకున్నట్లు కనిపించాడు పృథ్వీ. జట్టు స్కోర్ 54/5 వద్ద.. నెదర్లాండ్ పేసర్ పాల్ వాన్ మీకెరెన్ 16 ఓవర్​ బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్లో బౌనర్​గా వచ్చిన చివరి బంతిని పుల్ షాట్ ప్రయత్నంలో నియంత్రణ కోల్పోయాడు. తనను తాను అదుపు చేసుకులేక పృథ్వీ.. క్రీజులో జారిపడ్డాడు. ఈ క్రమంలో అతడి కాలు వికెట్లను తాకి, బెయిల్స్ కింద పడ్డాయి. ఇక చేసేదేమీలేక హిట్​ వికెట్​గా నిరాశతో పెవిలియన్ బాటపట్టాడు పృథ్వీ .

అయితే ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్​గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు అతడు ఔటైన తీరు పట్ల 'పాపం పృథ్వీ' అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా ఈ మ్యాచ్​లో 54 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన నార్తాంప్టన్ షైర్​.. టామ్ టేలర్ (112) సూపర్ సెంచరీతో విజయానికి దగ్గరైంది. కానీ ఆఖర్లో టేలర్ కూడా ఔట్ అవ్వడం వల్ల నార్తాంప్టన్ షైర్ 23 పరుగుల తేడాతో ఓడింది.

Prithvi Shaw County Cricket : కాగా గతనెల తీవ్ర వర్షాల్లో సైతం రాత్రిపూట బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసి వార్తల్లో నిలిచాడు పృథ్వీ. కొంతకాలంగా ఫామ్​లేమితో బాధపడుతున్న అతడిని.. సెలక్టర్లు పక్కన పెడుతూ వస్తున్నారు. ఐపీఎల్​ తర్వాత వెస్టిండీస్ పర్యటన, ఐర్లాండ్ టూర్, ఆసియా క్రీడలు ఇలా ఏ ఒక్క సిరీస్​కు పృథ్వీ జట్టులో స్థానం దక్కించుకోలేదు. ఇక కౌంటీల్లో అయినా రాణించి సెలక్టర్ల దృష్టిలో పడి.. మళ్లీ టీమ్ఇండియాలో ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నాడు.

ABOUT THE AUTHOR

...view details