టీమ్‌ఇండియా క్రికెటర్లలో కళాకారులు చాలామంది ఉన్నారు! గతంలో కొందరు టిక్‌టాక్‌లోనూ అలరించేవారు. ఇప్పుడు ఇన్‌స్టాలో లఘు వీడియోలు చేస్తున్నారు. చాలామంది యువ ఆటగాళ్లు సోషల్ మీడియాలో అభిమానులను అలరిస్తుంటారు. తాజాగా సూర్యకుమార్ యాదవ్, పృథ్వీ షా చేసిన ఓ వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. అందులో సూర్య, షా నటన చూస్తే నవ్వాగడం లేదు.
సూర్య, పృథ్వీ కామెడీ మామూలుగా లేదుగా! - పృథ్వీ షా కామెడీ వీడియో
సూర్యకుమార్ యాదవ్, పృథ్వీ షా కలిసి చేసిన ఓ కామెడీ వీడియో నెటిజన్లను తెగ నవ్విస్తోంది. అభిమానులు విపరీతంగా లైక్స్ కొడుతున్నారు. అదేంటో మీరూ చూసేయండి.
షా
ఇంగ్లాండ్ సిరీస్ కోసం సూర్య, షా ఇంగ్లీష్ గడ్డపై అడుగుపెట్టారు. గాయపడ్డ శుభ్‌మన్, వాషింగ్టన్ సుందర్ స్థానాల్లో వారు జట్టులో చేరారు. శ్రీలంక నుంచి నేరుగా ఈ బుడగలో ప్రవేశించారు. ఎప్పుడు చేశారో తెలియదు కానీ వారు చేసిన ఈ వీడియో అద్భుతంగా ఉంది! ఓ కాఫీ కప్ పట్టుకొని సూర్య రుచి చూస్తున్నాడు. వెనకే కూర్చున్న పృథ్వీ షాను చూసి 'హిహ్హిహ్హి..' అంటూ నవ్వుతున్నాడు. వీడియో సాంతం వీరిద్దరు చేసిన నటన ఆకట్టుకుంది. తెగ నవ్విస్తోంది. ఆ వీడియో మీకోసం..!