తెలంగాణ

telangana

ETV Bharat / sports

'అలా జరిగితే భారత్​తో ఇంగ్లాండ్​కు కష్టమే' - టీమ్ఇండియాతో టెస్ట్ సిరీస్

భారత్​తో జరగనున్న ఐదు మ్యాచ్​ల టెస్ట్​ సిరీస్​పై స్పందించాడు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్​ మైకేల్ వాన్. పచ్చికతో ఉన్న పిచ్​లను సిద్ధం చేయడం వల్ల రూట్​ సేనకు ఇబ్బందులు తప్పవని పేర్కొన్నాడు. కివీస్​తో సిరీస్​కు ఒక్క స్పెషలిస్ట్​ స్పిన్నర్​ కూడా జట్టులో లేకపోవడం ఇబ్బందిగా మారిందని తెలిపాడు.

michael vaughan, england cricketer
మైకేల్ వాన్, ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్

By

Published : Jun 13, 2021, 3:44 PM IST

భారత్​తో జరగనున్న టెస్ట్ సిరీస్​పై స్పందించాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్. ప్రస్తుత కివీస్​తో సిరీస్​లో ఇంగ్లాండ్​ ఘోర వైఫల్యం చెందిన నేపథ్యంలో.. టీమ్ఇండియాతో సిరీస్​కు పచ్చిక ఉన్న పిచ్​లను సిద్ధం చేయడం మంచిది కాదని అభిప్రాయపడ్డాడు.

"న్యూజిలాండ్​తో సిరీస్​లో ఒక్క స్పెషలిస్ట్​ స్పిన్నర్​కు కూడా జట్టులో చోటు ఇవ్వకపోవడం జట్టుకు ఇబ్బందికరంగా మారింది. నాలుగు సీమర్లతో కాకుండా ఒక స్పిన్నర్​కు కూడా అవకాశం ఇస్తే బాగుండేది. జాక్​ లీచ్​ను తుది జట్టులోకి తీసుకోవాల్సి ఉండేది" అని వాన్ పేర్కొన్నాడు.

కివీస్​తో రెండు టెస్ట్​ల సిరీస్​లో భాగంగా తొలి మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇక రెండో మ్యాచ్​లో రూట్​ సేన ఓటమి అంచుల్లో ఉంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప కివీస్ విజయం లాంఛనప్రాయమే.

ఇదీ చదవండి:WTC final: కివీస్​ను తక్కువ అంచనా వేయొద్దు!

ABOUT THE AUTHOR

...view details