Kohli Birthday Celebrations: కింగ్ కోహ్లీ.. పరుగుల యంత్రం.. బర్త్‌డే బాయ్ విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు, క్రికెటర్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌లో అదరగొట్టేస్తున్న విరాట్ కోహ్లీ 34వ ఏడాదిలోకి అడుగుపెట్టాడు. అభిమాన క్రికెటర్ పుట్టినరోజు వేడుకలను ఫ్యాన్స్ ఉత్సాహంగా జరిపారు. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాలో ఉన్న విరాట్.. జట్టు సభ్యుల సమక్షంలో కేక్ కోసి అందరికీ పంచాడు. ఆ వీడియోను బీసీసీఐ షేర్ చేసింది.
T20 World Cup: 'ఫైనల్ రోజు కేక్ కట్ చేస్తా'.. విలేకరులతో కింగ్ కోహ్లీ చిట్ చాట్! - టీ20 ప్రపంచ కప్ వార్తలు
ఆస్ట్రేలియాలో ఉన్న టీమ్ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి మీడియా ప్రతినిధుల సమక్షంలో కేక్ కట్ చేయగా.. శనివారం ఉదయం ప్లేయర్ల సమక్షంలో కేక్ కటింగ్ చేశాడు. ఈ సందర్భంగా విరాట్ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు.
అంతకుముందు శుక్రవారం అర్ధరాత్రి.. మీడియా ప్రతినిధుల సమక్షంలో కేక్ కట్ చేశాడు విరాట్. అప్పుడు ఓ సీనియర్ జర్నలిస్ట్.."మీరు ఎప్పుడైనా మీడియా సమక్షంలో కేక్ కట్ చేశారా?" అని అడిగాడు. వెంటనే కోహ్లీ.." మీరు ఎప్పుడూ నాకు కేక్ పంపలేదుగా(నవ్వుతూ)" అని సమాధానమిచ్చాడు. "మెల్బోర్న్ గ్రౌండ్ వద్ద కేక్ కట్ చేయడం ఆనందంగా ఉంది. అయితే నేను వచ్చే ఆదివారం కేక్ కట్ చేద్దామనుకుంటున్నాను. ఆ రోజేంటో మీకు తెలిసిందే. టీ20 ప్రపంచకప్ ఫైనల్" అంటూ విరాట్ చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో కోహ్లీ.. మీడియా ప్రతినిధులతో గ్రూప్ ఫొటో దిగాడు. కొందరు జర్నలిస్టులు.. విరాట్‌కు గిఫ్ట్‌లు ఇచ్చారు.